గూగుల్ పే యాప్ ను తొలగించిన యాపిల్.. కారణమిదే..?

భారతదేశంలో డిజిటల్ లావాదేవీల కోసం స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించే యాప్ లలో గూగుల్ పే ఒకటి.ఈ యాప్ ద్వారా లావాదేవీలు జరిపితే స్క్రాచ్ కార్డుల ద్వారా నగదు గెలుచుకునే అవకాశం ఉండటంతో పాటు త్వరితగతిన లావాదేవీలు పూర్తవుతాయి కాబట్టి ఈ యాప్ ను వినియోగించడానికి స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ప్రాధాన్యతనిస్తారు.

 Google Pay App Removed From Apple App Store Temparorily  Google Pay, Apple Store-TeluguStop.com

మొదట గూగుల్ “తేజ్” పేరుతో ఈ యాప్ ను తీసుకురాగా తరవాత కాలంలో “గూగుల్ పే” గా మారింది.

అయితే యాపిల్ యాప్ స్టోర్ నుంచి గూగుల్ పే యాప్ ను యాపిల్ ఇండియాలో తాత్కాలికంగా తొలగించింది.2020 ఆగష్టు నెలలో యాపిల్ ఫోన్లలో గూగుల్ పే వినియోగించిన కస్టమర్లు లావాదేవీల విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు.గూగుల్ పే అప్పుడు సమస్యను పరిష్కరించినా పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారం కావాలనే ఉద్దేశంతో యాపిల్ ను తాత్కాలికంగా యాప్ ను తొలగించమని గూగుల్ పే ప్రతినిధులు కోరగా యాప్ ను తాత్కాలికంగా యాపిల్ తొలగించింది.

యాపిల్ పే యూజర్లు యాపిల్ స్టోర్ నుంచి గూగుల్ పే డౌన్ లోడ్ చేయాలని ప్రయత్నిస్తే ఆ యాప్ కనిపించదు. గూగుల్ పే అధికార ప్రతినిధి యాప్ తొలగించడం గురించి మాట్లాడుతూ సమస్య పరిష్కారం కోసమే యాప్ తొలగింపు జరిగిందని.

ఆండ్రాయిడ్ యూజర్లకు యాప్ అందుబాటులో ఉంటుందని.త్వరలో మళ్లీ యాప్ ను యాపిల్ స్టోర్ లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

గూగుల్ పే కస్టమర్లలో కొందరు లావాదేలు జరిపే సమయంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారని.గూగుల్ పే సిబ్బంది సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తోందని.

యాపిల్ ఫోన్ యూజర్లు సమాచారం కోసం గూగుల్ పే కస్టమర్ కేర్ ను సంప్రదించవచ్చని తెలిపారు.ఆండ్రాయిడ్ యూజర్లకు ఎటువంటి సమస్య లేదని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube