గూగుల్ సరి కొత్త ఫీచర్ వల్ల కొత్త ఇబ్బందులట..!?

ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ మాయలో ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.ఎందుకంటే పిన్ టూ పిన్ ప్రతి సమాచారం కూడా నెట్ లో సెర్చ్ చేయగానే దొరుకుతుంది.

 Google New Feature, Problems, New Update, Technology, Viral, Viral News, Google-TeluguStop.com

అయితే మనం వాడే ఇంటర్నెట్‌లో ప్రైవసీ ఉంటుందా అనే ప్రశ్న మీకు ఎప్పుడన్నా వచ్చిందా.? అయితే ఇంటర్నెట్ వాడకంలో ప్రైవసీ ఉంటుందా అంటే కష్టమే అంటున్నారు మన టెక్నాలజీ నిపుణులు. అందుకు తగ్గట్టే చాలా టెక్‌ దిగ్గజాలు డేటా లీకేజీ సమస్యలు ఎదుర్కొవడం మనకు తెలిసిందే.తాజాగా గూగుల్ క్రోమ్‌ చేస్తున్న ప్రయత్నం మరోసారి ప్రైవసీ టాపిక్‌ ను లేవనెత్తింది.

గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ ను వినియోగించినప్పుడు యూజర్‌ చూసే ప్రతి ఒక్కటి ట్రాక్‌ చేస్తుందనే విషయం తెలిసిందే.అయితే ఆ ఇబ్బంది తొలగిస్తాం అంటూ ఫెడరేటడ్‌ లెర్నింగ్‌ కోహోట్‌ (FLoC)అనే కొత్త టెక్నాలజీని తీసుకొస్తోంది.

అయితే ట్రాకింగ్‌ కంటే ‘ఫ్లోక్‌’ తోనే ఎక్కువ ఇబ్బంది అనేది టెక్‌ నిపుణుల మాట.అసలేంటీ ‘ఫ్లోక్‌’ అనే విషయం ఒకసారి పరిశీలిస్తే.మీరు బ్రౌజర్‌ లో ఏయే వెబ్‌ సైట్లు చూశారు అనేది తెలుసుకొని దానికి సంబంధించిన ప్రకటనకర్తలు యాడ్‌ లు ఇచ్చేవారుకు ఆ సమాచారం అందజేస్తారు.ఫలితంగా మీ బ్రౌజర్‌ లో వాటికి సంబంధించిన యాడ్స్‌ వచ్చేలా చేస్తుంటుంది.

ఇదంతా ట్రాకింగ్‌ ద్వారానే సాధ్యమవుతోంది.అయితే ‘ఫ్లోక్‌ ’టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఏ వెబ్‌సైట్లు కూడా యూజర్లను ట్రాక్‌ చేయవు అని గూగుల్‌ చెబుతోంది.

అయితే ‘ఫ్లోక్‌’ ట్రాకింగ్‌ కి మించి సమాచారాన్ని యూజర్ల నుంచి పొందుతోందట.దీనికి కారణం ‘ఫ్లోక్‌’ యూజర్‌ బ్రౌజింగ్‌ యాక్టివిటీ, హిస్టరీని యాక్సెస్‌ చేయగలగడమే.

ఇలా ఒకే తరహా వెబ్‌సైట్లు చూసే వారందరినీ ఒక గ్రూపుగా మారుస్తుందన్నమాట.వారికి దానికి సంబంధించిన యాడ్స్‌ పంపిస్తుంటుంది.

గూగుల్‌ క్రోమ్‌ ‘ఫ్లోక్‌’ సాంకేతికతను ఇప్పటికే కొంతమంది వినియోగదారులకు ఆక్టివేట్ అయిందట.అయితే మొత్తం గూగుల్‌ క్రోమ్‌ వినియోగదారుల్లో ‘ఫ్లోక్‌’ యాక్టివ్‌ అయిన వినియోగదారులు 0.5 శాతం ఉంటారని తెలుస్తోంది.అంటే వారి సెర్చ్‌ హిస్టరీ, యాక్టివిటీపై గూగుల్‌ ఇప్పటికే ఓ కన్నేసిందన్నమాట.

ఎవరి బ్రౌజర్‌లో ‘ఫ్లోక్‌’ యాక్టివ్‌ అయి ఉంది అనేది తెలుసుకోవడానికి ఈఎఫ్‌ఎఫ్‌ అనే వెబ్‌సైట్‌ ఓ ట్రాకింగ్‌ టూల్‌ ని సిద్ధం చేసింది.ఈ టూల్‌ను మీ బ్రౌజర్‌లో రన్‌ చేస్తే ‘ఫ్లోక్‌’ యాక్టివ్‌ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవచ్చు.

అయితే గూగుల్‌ ఇలా చెప్పా పెట్టకుండా ఫ్లోక్‌ లాంటి సాంకేతికతను తీసుకురావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.దీంతో ఈ ఇబ్బంది తొలగాలంటే బ్రౌజర్‌ వినియోగం మార్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రైవసీ విషయంలో పేరున్న మొజిల్లా ఫైర్‌ ఫాక్స్‌, గోస్ట్రీ లాంటి బ్రౌజర్లు వాడటం మంచిదని సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube