సరి కొత్త ఫీచర్ తో గూగుల్‌..!?‌

ఏళ్ళు గడుస్తున్నకొద్దీ టెక్నాలజీ రంగంలో ఎన్నో పెను మార్పులు వస్తున్నాయి.గతంలో ప్రజలు తమ సందేశాలను కావాల్సిన వారికి చేరవేయడానికి ఉత్తరాలు రాసేవారు.

 Schedule Messages In Google Messaging Application, Google Message, New Features,-TeluguStop.com

ఉత్తరాలు ఒకరి నుంచి మరొకరికి చేరుకునేసరికి దాదాపు 7 రోజులు పట్టేది.అయితే కొన్ని దశాబ్దాల తర్వాత ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.

కొద్ది ఏళ్ళలోనే మొబైల్ ఫోన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.దీంతో ప్రజలు తమ సందేశాలను క్షణాల్లో ఇతరులతో పంచుకునే వారు.

కానీ ఎస్ఎంఎస్లు, ఫోన్ కాల్స్ చేయాలంటే చాలా డబ్బులు వెచ్చించవలసిన వచ్చేది.ఐతే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఫేసుబుక్, వాట్సాప్ అప్లికేషన్స్ ద్వారా తక్కువ డబ్బులకే మెసేజ్లు పంపించ గలిగాం.

దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు కూడా మొబైల్ ఫోన్లను వాడగలుగుతున్నారు.

అయితే మొబైల్ వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించి వారి పనులను వేగవంతం చేసే దిశగా టెక్నాలజీ రూపొందుతోంది.

చిన్న వ్యాపారాల నుంచి బడా వ్యాపారుల వరకు అందరూ కూడా ఫోన్లపైనే తమ పనులను క్షణాల్లోనే పూర్తి చేస్తున్నారు.టెక్నాలజీని ఇంకా మెరుగు పరిచేందుకు.వినియోగదారులకు తమ పనులను సులభతరం చేసేందుకు డెవలపర్లు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నారు.ఈ నేపధ్యంలోనే గూగుల్ సంస్థ తమ మెసేజింగ్ యాప్ లో నిర్ణీత సమయానికి మెసేజ్లను పంపించడానికి ముందుగానే టైమ్ షెడ్యూల్ చేసే ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది.

ఇప్పటివరకు ఈ ఫీచర్ ఏ మెసేజింగ్ అప్లికేషన్ లో లేదు.దీంతో వినియోగదారులు ఒక నిర్ణీత సమయానికి మెసేజ్లు పంపించడానికి ముందుగానే టైం సెట్ చేసుకోలేక ఇబ్బంది పడేవారు.

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలని తాజాగా “మెసేజ్‌ షెడ్యూలింగ్‌” అనే సరికొత్త ఫ్యూచర్ ని గూగుల్ మెసెంజర్ అప్లికేషన్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు.

Telugu Google Message, Google, Google Ups, Message, Ups, Store-Latest News - Tel

ఈ ఫ్యూచర్ కోసం యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ లోని గూగుల్ మెసెంజర్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.అనంతరం మెసేజింగ్ అప్లికేషన్ ని డిఫాల్ట్ మెసేజింగ్ అప్లికేషన్ గా సెట్ చేసుకోవాలి.ఆ తర్వాత మనం మెసేజ్ పంపదలుచుకున్న వ్యక్తి యొక్క చాట్ బాక్స్ ఓపెన్ చేసి ఒక మెసేజ్ టైపు చేసి పక్కనే ఉన్న సెండ్ బటన్ పై లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

అప్పుడు షెడ్యూల్ సెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.దాన్ని సెలెక్ట్ చేసుకుని మనకి కావాల్సిన టైం ని సెట్ చేసి.సెండ్ బటన్ పై క్లిక్ చేయాలి.దీనితో మనం సెటప్ చేసిన నిర్ణీత సమయానికి అవతల వ్యక్తికి మెసేజ్ చేరిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube