కొత్త ఫీచర్ ను తీసుకువచ్చిన గూగుల్ మీట్..!

ఇప్పుడు టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందింది.ఎన్నో కొత్తకొత్త రకాల యాప్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి.

 Google Meat Brings New Feature  New Features, Google, Google Meet, Latest Viral,-TeluguStop.com

ఆ యాప్ లకు దీటుగా కొత్త రకాల సర్వీసులు అందించడానికి గూగుల్ ఎంతగానో ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా గూగుల్‌ మీట్‌ లో రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

వాటిలో ఒకటి క్రాస్‌ డొమైన్‌ లైవ్‌ స్ట్రీమ్‌, అలాగే రెండోది క్యాప్షన్స్‌.అయితే ప్రస్తుతం ఈ ఫీచర్లు గూగుల్‌ వర్క్‌ స్పేస్‌ స్టాండర్డ్‌, ఎంటర్‌ప్రైజ్‌ ప్లస్‌, టీచింగ్‌ అండ్ లెర్నింగ్‌ అప్‌ గ్రేడ్‌, ఎడ్యుకేషన్‌ ప్లాన్స్‌ ఉన్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మరి ఈ రెండు రకాల కొత్త ఆప్షన్లు ఎలా యుజర్లకు ఉపయోగకరంగా ఉంటాయనేది చూద్దాం.

గతంలో గూగుల్‌ మీట్‌ కాల్ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నప్పుడు కేవలం సొంత ఆర్గనైజేషన్‌ కి చెందిన వ్యక్తులు మాత్రమే చూడగలిగేవాళ్లు.

కానీ ఇప్పుడు ఈ సరికొత్త ఫీచర్ వలన ఆ మొత్తం వీడియో ఫుటేజ్‌ లైవ్‌ స్ట్రీమ్‌ ను చేస్తే ఇకపై ఎవరైనా చూడొచ్చు అన్నమాట.

Telugu Google, Google Meet, Latest-Latest News - Telugu

అయితే ఇప్పుడు అడ్మిన్స్‌ ట్రస్ట్‌ చేసిన గెస్ట్‌లు కూడా చూడొచ్చట.అలా అన్నిరకాల డొమైన్లను యాక్సెప్ట్ చేయొద్దని గూగుల్‌ ముందుగా హెచ్చరిస్తుంది.ప్రస్తుతం ఈ గూగుల్ మీట్ సేవలను ఆన్‌బోర్డింగ్‌ ట్రైనింగ్‌, పెద్ద పెద్ద గ్రూపు ఎంప్లాయిస్‌ కోసం వినియోగిస్తున్నారు.

ఒక్కో మీటింగ్‌ లో గరిష్ఠంగా లక్ష మంది వినియోగదారులు పల్గొనవచ్చని, మరికొన్ని సందర్భాల్లో పది వేల మంది ఉన్న సభ్యులు పార్టిసిపేట్ చేసిన సందర్భాలూ ఉన్నాయని గూగుల్ చెబుతుంది.

Telugu Google, Google Meet, Latest-Latest News - Telugu

ఇంకొక ఫీచర్ కుడా అందుబాటులోకి తీసుకువచ్చింది గూగుల్ అదే కాప్షన్స్.ఏదన్నా లైవ్‌ స్ట్రీమింగ్‌ జరుగుతున్నప్పుడు ఆ మాటల్ని అప్పటికప్పుడు అక్షరాల రూపంలో కనపరచడాన్ని లైవ్‌ స్ట్రీమ్‌ క్యాప్షన్స్‌ అంటారు.ఈ ఆప్షన్‌ను గూగుల్‌ మీట్‌ కాల్స్ లేదా కాన్ఫరెన్స్‌ లో కూడా ఇప్పుడు తీసుకొస్తున్నారు.

అంటే ఎవరయితే గూగుల్‌ మీట్‌ యూజ్‌ చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్‌ గా క్యాప్షన్స్‌ కనిపిస్తున్నాయి.ప్రస్తుతానికి కొన్ని భాషల్లో మాత్రమే ఈ లైవ్‌ క్యాప్షన్స్‌ ఆప్షన్ పని చేస్తోంది.

ఈ కాప్షన్ ఫీచర్ వలన చెవుడు, వినికిడి లోపం ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది.ఎందుకంటే వాళ్ళకి చూడటం, వినడం కంటే స్క్రీన్ పై చదవడమే బాగుంటుంది.కాబట్టి.వాళ్ళకి ఈ ఆప్షన్ ఉపయోగకరంగా ఉంటుంది.

రాబోయే కాలంలో మరికొన్ని సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకుని వస్తామని చెబుతుంది గూగుల్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube