ప్రాణం తీసిన గూగుల్ మ్యాప్.. ఎలా అంటే..?!

ప్రస్తుతం టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగిస్తున్న కారణంగా మనం బయటికి ఎక్కడికైనా తెలియని ప్రదేశానికి వెళుతున్న సమయంలో కచ్చితంగా గూగుల్ మ్యాప్స్ ఉపయోగించడం పరిపాటిగా మారిపోయింది.నిజానికి ఇంత టెక్నాలజీ అందిస్తున్న గూగుల్ సంస్థకి మనం రుణపడి ఉండాల్సిందే.

 Minius Degrees Weather, Google Maps, By Road, Short Cut Road,cybeeria,road Trip,-TeluguStop.com

అలా అని మనం గూగుల్ మ్యాప్ ను మాత్రమే నమ్ముకుంటే మాత్రం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.ఒక్కోసారి గూగుల్ మ్యాప్ చూపించే దారిలో గుడ్డిగా వెళ్ళిపోతే చివరికి ప్రాణాలు సైతం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

అయితే ఇలా ఎందుకు అని అనుకుంటున్నారా.? అయితే కచ్చితంగా మీరు ఈ సంఘటన గురించి తెలుసుకోవాల్సిందే.

తాజాగా సైబీరియా దేశానికి చెందిన ఓ యువకుడు అతని స్నేహితుడు కలిసి వారం రోజుల పాటు వారి కారులో రోడ్డు ట్రిప్ కు బయలుదేరారు.ఈ ట్రిప్ లో భాగంగా వారు ప్రపంచంలోనే అత్యంత చల్లని వాతావరణం కలిగిన నగరంగా పేరుగాంచిన మగదన్ – యాకుట్స్క్ అనే మార్గం ద్వారా వారు బయలుదేరారు.

అయితే వీరు వెళ్ళాల్సిన హైవే మీదుగా ప్రయాణించే సమయంలో గూగుల్ మ్యాప్ ద్వారా సూచించిన సరైన రోడ్డు కాకుండా షార్ట్ కట్ మార్గాన్ని ఎంచుకోవాలని ఆలోచించారు.ఇందులో భాగంగానే గూగుల్ మ్యాప్ మరో మార్గాన్ని చూపించింది కానీ.

అది ఎంచుకుంటే చాలా ప్రమాదమని సూచించిన కూడా వారు లెక్కచేయకుండా అదే మార్గంలో వెళ్ళసాగారు.అయితే నిజానికి అది వారు వెళ్ళవలసిన మార్గం కానే కాదు.

కాకపోతే, 170 కిలోమీటర్లు ప్రయాణం తగ్గుతుందన్న నెపంతో ఆ యువకులు ఆ మార్గాన్ని ఎంచుకున్నారు.

దీంతో షార్ట్ కట్ అని భావించిన వారు మార్గమధ్యంలో వారు తీవ్రమైన చలి వల్ల వారి కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది.

అయితే అక్కడి నుంచి వేరే మార్గం లేకపోవడంతో ఆ ఇద్దరు కూడా ఆ కార్ లోనే అనేక ఇబ్బందులు పడ్డారు.వారు ఎవరినైనా కమ్యూనికేట్ చేద్దాం అంటే వారి ఫోన్స్ కూడా సిగ్నల్ అందుకోకపోవడంతో వారికి భూమి మీద ఉండే కాలం అయిపోయింది.

దాదాపు మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వారు గజగజ వణికిపోయి చివరికి తట్టుకోవడానికి వారి కార్ల యొక్క టైర్లను తొలగించి మరి మంట వేసుకొని.అలా వారం రోజుల పాటు ఆ ఇద్దరు గడిపారు.

అయితే వారం రోజులు కావడంతో అందులో ఇద్దరు కదలలేని స్థితికి చేరిపోయారు.అందులో ఒకరు అక్కడే చనిపోగా, మరొకరు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు.

వారం రోజులు అవుతున్న ఇద్దరు పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు జరిపిన సెర్చ్ ఆపరేషన్లో చివరికి వారి ఆచూకీ తెలుసుకుని అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.కాబట్టి గూగుల్ మార్గాన్ని చూపిస్తుంది కానీ, మార్గమధ్యంలో మీకు కావలసిన అడ్రస్ సంబంధించి వివరాలను ఆ ప్రాంతంలో వారిని తెలుసుకుంటూ ముందుకు సాగితే మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube