గొర్రెల దొంగలకు గూగుల్ సాయం !

టెక్నాలజీ రోజు రోజుకి పెరిగిపోతోంది.ఈ పెరిగిన టెక్నాలజీని మంచికి ఉపయోగించుకునే వారు కొంతమంది అయితే… చేదు మార్గాలకు ఉపయోగించుకుంటున్నారు మరికొంతమంది.

 Google Map Helping Goat Thefting-TeluguStop.com

ఇక పెరిగిన ఈ టెక్నాలజీని క్యాష్ చేసుకుంటూ… చివరికి ఓ ఇద్దరు దొంగలు కటకటాల పాలయ్యారు.ఇంతకీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే ఆ ఇద్దరు దొంగలకు సాయం చేసింది మరెవరో కాదు గూగుల్.

అవును… గూగుల్ మ్యాప్ సాయంతో ఏకంగా గొర్రెలనే మాయం చేస్తున్నారు ఇద్దరు మాయగాళ్లు.వివరాలు చూస్తే….రంగారెడ్డి జిల్లాలోని పోతుబండ తండాలో వ్యవసాయం చేసే విస్లావత్‌ భాజేందర్‌ గొర్రెలు, మేకలు చోరి చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు.గ్రామ శివార్లలో కాపలా లేకుండా ఉన్న గొర్రెలు, మేకలను టార్గెట్ చేసేవాడు.

ఇందుకు తన దగ్గరి బంధువు రత్తావత్ అనే ఆటోడ్రైవర్ సహాయం తీసుకునేవాడు.

భాజేందర్‌ తన బైకుపై వెళ్లి భద్రత లేకుండా ఉన్న గొర్రెలు, మేకలను గుర్తించేవాడు.తర్వాత అతడు ఉన్న చోటును గుర్తించే గూగుల్‌ మ్యాప్‌ను వాట్సప్‌ ద్వారా ఆటోడ్రైవర్‌కు పంపించేవాడు.చీకటి పడిన తరువాత ఈ ఇద్దరు ఆ మ్యాప్‌ ఆధారంగా అక్కడికి చేరుకుని.

గొర్రెలు, మేకలను ఆటోలోకి ఎక్కించేవారు.ఇలా దాదాపు 90 మేకలు, గొర్రెలను అపహరించేవారు.

ఈ వరుస ఘటనలపై సమాచారం అందుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టి ఎట్టకేలకు దెబ్బడగూడ చౌరస్తా దగ్గర ఆ ఇద్దరిని పట్టుకోగలిగారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube