మోసపోయిన స్టార్ హీరో అజిత్.. మోసం చేసిందెవరంటే..?

కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాల్లో నటించడంతో పాటు విజయాలు సాధిస్తూ గుర్తింపును సంపాదించుకున్నారు అజిత్.ఎప్పుడూ సినిమాల ద్వారా వార్తల్లో నిలిచే అజిత్ మోసపోయి తాజాగా వార్తల్లో నిలిచారు.

 Google Map Cheated Star Hero Ajith Kumar By Giving Wrong Route, Hero Ajith, Chea-TeluguStop.com

అజిత్ గూగుల్ మ్యాప్స్ ను నమ్మడం వల్ల మోసపోవడం గమనార్హం.కొన్ని సందర్భాల్లో మనం గూగుల్ మ్యాప్స్ మనం వెళ్లాల్సిన ప్రాంతాన్ని తప్పుగా చూపించడం వల్ల ఇబ్బందులు పడి ఉంటాం.

అజిత్ చెన్నైలో ఉన్న రైఫిల్ క్లబ్ అనే ప్రాంతానికి వెళ్లడానికి గూగుల్ మ్యాప్ సహాయం తీసుకున్నారు.ఎగ్మూరులో ఉన్న రైఫిల్ క్లబ్ అనే ప్రాంతానికి అజిత్ వెళ్లాల్సి ఉండగా గూగుల్ మ్యాప్ చూపిన దారి ప్రకారం అజిత్ వాహనం వెప్పేరి ప్రాంతానికి వెళ్లింది.

తన తరువాత సినిమా కోసం రైఫిల్ షూటింగ్ లో ట్రైనింగ్ తీసుకోవాలని భావించిన అజిత్ కారులో వెప్పేరిలోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు.

Telugu Ajith Kumar, Google Map, Ajith, Riffle Club, Valimai, Vepperi, Route-Movi

అక్కడ రైఫిల్ క్లబ్ లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందిని అజిత్ రైఫిల్ క్లబ్ గురించి అడగగా ఇక్కడ రైఫిల్ క్లబ్ లేదని.పాత పోలీస్ కమిషనర్ ఆఫీస్ దగ్గర రైఫిల్ క్లబ్ ఉందని అజిత్ కు సిబ్బంది చెప్పారు.అజిత్ వెప్పేర్ ప్రాంతానికి రావడంతో ఆయన అభిమానులు కొందరు అజిత్ తో కలిసి సెల్ఫీలు దిగారు.

అజిత్ ప్రస్తుతం వాలిమై సినిమాలో నటిస్తున్నారు.స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ వాలిమై సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా వినోద్ ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు.

ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా అజిత్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.నటుడు కార్తికేయ ఈ సినిమాలో విలన్ రోల్ లో నటిస్తుండగా యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఈ మూవీలో అజిత్ కు జోడీగా హ్యూమా ఖురేషీ నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube