ఆ రకమైన యాప్‌ డెవలపర్లకు చెక్ పెడుతున్న గూగుల్... నిబంధనలు ఇవే!

రోజురోజుకీ టెక్నాలజీ పరుగులు పెడుతోంది.దానికి అనుగుణంగానే యువత ఆలోచనా విధానం కూడా మారుతోంది.

 Google Is Keeping A Check On Such App Developers Google, Technology Updates, Tec-TeluguStop.com

నేడు మార్కెట్లో అందుబాటులో వున్న టెక్నీకల్ కోర్సుల్ని నేర్చుకొని నిరంతరం అప్ గ్రేడ్ అవుతున్నారు స్టూడెంట్స్.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యాప్స్ హవా నడుస్తోంది.

ఆన్లైన్ మార్కెట్ ఇపుడు రాజ్యమేలుతోంది.షాపింగ్ అనేది ఇపుడు పరోక్షంగా జరుగుతోంది.

పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుండి, గాలిలో వున్న చిన్న షాపుల వరకు అందరు ఇపుడు ఆన్లైన్ ప్లాట్ ఫామ్ మీదే ఆధారపడవలసిన పరిస్థితి.

ఈ నేపథ్యంలో డెవలపర్స్ సొంతంగా కొన్ని యాప్స్ రూపొందించి తద్వారా వ్యాపారాలు చేస్తున్నారు.

నేటి యువత అభిరుచులకు తగ్గట్టే గూగుల్ కూడా ఎంతో సహకరిస్తోంది.స్మార్ట్‌ ఫోన్‌ల వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో అన్ని పనులకు ఇపుడు యాప్‌లను ఉపయోగించే పరిస్థితి.

ఇలాంటి యాప్స్ అన్నింటికి ప్లే స్టోర్‌ వేదిక కావడం విశేషం.అయితే అన్ని అవసరాలను తీరుస్తోన్న యాప్స్‌ యూజర్ల భద్రతను మాత్రం ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి.

ముఖ్యంగా యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకునే సమయంలో అడిగే పర్మిషన్స్‌ యూజర్ల సమాచారాన్ని యాప్‌ నిర్వాహకులు చేతిలో పెడుతున్నాయి.దీంతో యూజర్ల భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది.

దీంతో ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి గూగుల్‌ సరికొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

Telugu Developers, Google, Latest, Ups-Latest News - Telugu

తాజాగా విధించిన నిబంధనల ప్రకారం.యూజర్లు యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసే సమయంలో యాప్‌ డెవలపర్‌ ఎలాంటి డేటా సేకరిస్తున్నారు, దాన్ని ఎవరితోనైనా పంచుకుంటున్నారా? అనే సమాచారాన్ని తప్పకుండా తెలియజేయాలి.యాప్‌ డెవలపర్స్‌ అందించిన సమాచారాన్ని గూగుల్‌ తనిఖీ చేసి ఆ సమాచారాన్ని ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచుతుంది.

యాప్‌ నిర్వాహకులు యూజర్ల డేటా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏ కార్యకలపాలు జరిపినా తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటుంది.జులై 20 నుంచి డేటా సేఫ్టీ నిబంధనలను పాటించని యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తామని గూగుల్‌ ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube