ఒలంపిక్స్ కోసం అదిరిపోయే ఫీచర్స్ అందించబోతున్న గూగుల్..!

ఒలింపిక్స్ అంటే ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఓ గొప్ప క్రీడా వేదిక.దీనిని చూడటానికి చాలా మందికి అవకాశం ఉంటుంది.

 Google Is Going To Provide Exciting Features For The Olympics  Olympics, Google,-TeluguStop.com

అయితే అది చాలా మందికి సాధ్యం కాదు.కొందరికే సాధ్యం అవుతుంది.

మరి ఇటువంటి దానిని అందరికీ అందిచడానికి గూగుల్ రెడీ అయ్యింది.గూగుల్ తాజాగా ఒక బ్లాగ్ ను ప్రజలతో పంచుకుంది.

ఆ బ్లాగులో ఇంటి నుంచే ఒలింపిక్స్ ను చూడొచ్చు.మరి గూగుల్ తీసుకొచ్చిన ఆ ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కంట్రీ ర్యాంకింగ్స్, ఫ్యూచర్ ఈవెంట్స్, రిక్యాప్ వీడియోస్:

గూగుల్ అనేది ఇప్పుడే కాదు ఇకపై భవిష్యత్ లో కూడా జరిగే క్రీడల గురించి దీని ద్వారా తెలియజేయగలదు.రాబోయే రోజుల్లో ఏయే ఈవెంట్లు జరుగుతాయనే విషయాన్ని కూడా గూగుల్ అందిస్తుంది.

ఇండియా ఒలింపిక్స్‌ అని గూగుల్లో సెర్చ్ చేసినట్లైతే ఇండియా క్రీడాకారులు ఆడే గేమ్స్ అన్నీ అందులో కనిపిస్తాయి.అదేవిధంగా సెర్చ్ చేసిన దేశాల వార్తలను, వీడియోను చూసేందుకు ఓ ఫీచర్ కూడా తెచ్చింది.

వాటిలో ఆ మ్యాచ్ రిజల్ట్స్ కూడా చూసేయవచ్చు.

Telugu Games, Google, Olym-Latest News - Telugu

గూగుల్ డూడుల్:

ఇది చాలా మందికి ఇష్టం.ఇందులో సరికొత్త గేమ్స్ ఉంటాయి.గూగుల్ జపనీస్ యానిమేషన్ స్టూడియో 4°C సాయంతో ఛాంపియన్ ఐలాండ్ గేమ్స్ ను తీసుకొచ్చింది.

ఇందులో టోర్నమెంట్లు కూడా ఆడేయవచ్చు.స్కేట్ బోర్డింగ్, రగ్బీ, క్లైంబింగ్ లాంటి గేమ్స్ ఆడేయవచ్చు.

ఇవి ఆడాలంటే మీరు గూగుల్.కో.ఇన్ సైట్ లోకి వెళ్లి డూడుల్ పై క్లిక్ చేస్తే చాలు.

Telugu Games, Google, Olym-Latest News - Telugu

యూట్యూబ్, గూగుల్ టీవీలలో ఒలింపిక్స్ లైవ్ అప్డేట్స్:

ఇందులో మార్కా క్లారో, యూరోస్పోర్ట్ ఛానెల్‌ల నుంచి లైవ్ ఈవెంట్‌లతో పాటు క్లిప్‌లు, ముఖ్యాంశాలను చూడొచ్చు.ఒలంపిక్స్అనే యూట్యూబ్ ఛానెల్‌ ను చూడొచ్చు.ఇందుకోసం ఫర్ యూ అనే పేజీని చూస్తే చాలు.

ఎవరు గెలిచారో చెప్పే గూగుల్ అసిస్టెంట్‌:

ఈ ఫీచర్ ద్వారా ఒలంపిక్స్ పోటీల్లో ఎవరు గెలిచారనే విషయాన్ని తెలుసుకోవచ్చు.

Telugu Games, Google, Olym-Latest News - Telugu

ఒలింపిక్స్‌కి సంబంధించిన అప్లికేషన్లు:

గూగుల్ ప్లే స్టోర్ లో మనం చూసినట్లైతే ఒపింపిక్స్ గేమ్స్ కు సంబంధించి అనేక యాప్ లు అందుబాటులోకి రావడం జరిగింది.ఒలంపిక్స్ యాప్ తో పాటు మరికొన్ని అప్లికేషన్లు కూడా అందుబాటులోకొచ్చాయి.

గూగుల్ ఆర్ట్స్ మరియు కల్చర్, స్ట్రీట్ వ్యూ, ట్రాన్స్‌లేట్:

దీని ద్వారా జపాన్ సాంప్రదాయ హస్తకళలు, జపాన్ ఫుడ్ ఐటమ్స్ గురించి మనం ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.ఇక గూగుల్ మ్యాప్స్‌ ద్వారా జపాన్ లోని స్ట్రీట్స్ ను చూడొచ్చు.టోక్యోలోని ఎన్నో రకాల పర్యాటక ప్రాంతాలను చూడొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube