మరో సరికొత్త ఫీచర్ ను తీసుకురాబోతున్న గూగుల్..!

ప్రముఖ గూగుల్ సంస్థ ఈ కొత్త ఏడాదిలో సరికొత్త ఫీచర్ తో మన ముందుకు రాబోతుంది.అదేంటో తెలిస్తే మీరే షాక్ అవుతారు.

 Google Is Going To Bring Another New Feature, Google, Google Search, New Feature-TeluguStop.com

ఈ మధ్య షార్ట్ వీడియోస్, టిక్ టాక్ వీడియోస్ బాగా ఫేమస్ అయిపోయిన విషయం తెలిసిందే.అయితే ఈ వీడియోలను చూడడానికి మనం ఆ ప్రత్యేక యాప్ లో మాత్రమే చూసేవాళ్ళము.

ఇక మీదట అలా చూడవలిసిన పని లేదు.గూగుల్ తీసుకువచ్చే ఈ సరి కొత్త ఫీచర్ లో భాగంగా ఇన్‌స్టాగ్రాం, టిక్‌ టాక్‌ షార్ట్ వీడియోలను గూగుల్ సెర్చ్ లో తీసుకొని రావడానికి సన్నాహాలు చేస్తుంది.

అంటే ప్రస్తుతం సెర్చ్‌ రిజల్ట్‌ లో మనకు కావలిసిన అంశాన్ని సెర్చ్ చేస్తాము కదా.అలా కనిపించే వెబ్‌ సైట్‌ ల జాబితాపైన షార్ట్ వీడియోలు కనిపించేలా ఈ ఫీచర్ తీసుకురానున్నారు.

అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఇంకా టెస్టింగ్ దశలో ఉంది.ఇది విజయవంతం అయితే రానున్న కొద్ది రోజుల్లోనే గూగుల్ యూజర్లు అందరికి ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం గూగుల్ తీసుకొస్తున్న ఈ షార్ట్ వీడియో ఫీచర్ అనేది గతంలో తీసుకొచ్చిన గూగుల్ స్టోరీస్‌ కు ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది.ఈ క్రమంలో ఇప్పటి వరకు కేవలం యూట్యూబ్‌, టాంగీ, ట్రెల్‌ ల నుంచి మాత్రమే షార్ట్‌ వీడియోలను మాత్రమే గూగుల్ తీసుకునేవారు.

Telugu Google, Google Search, Upd-Latest News - Telugu

కానీ ఇకమీదట తాజాగా వచ్చిన ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రాం, టిక్‌ టాక్‌ ల షార్ట్‌ వీడియోలు కనిపించేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.ఇంకో విశేషం ఏంటంటే.ఈ వీడియోలను క్లిక్ చేస్తే కేవలం వెబ్‌వెర్షన్‌ లో మాత్రమే ఓపెన్ అవుతాయి.యాప్స్ ఓపెన్ కావు.దానివల్ల యూజర్ యాప్‌ లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదని గూగుల్ భావిస్తోందట.మరి ఈ సారి కొత్త ఆప్షన్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube