విద్యార్థినులకు గూగుల్ శుభవార్త.. సెలెక్ట్ అయితే రూ.74 వేలు మీవే..!

మీరు ఫిమేల్ స్టూడెంట్సా.కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చదువుకుంటున్నారా? కంప్యూటర్ సైన్స్‌లో విజయవంతమైన కెరీర్ ఏర్పరుచుకోవడం మీ కలా? అయితే మీ కల సాకారం చేసేందుకు గూగుల్ రూ.74 వేల ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.ప్రపంచంలోని అన్ని దేశాల్లో కంప్యూటర్ సైన్స్ చదువుకుంటున్న విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌ రూపంలో 1000 డాలర్లు( సుమారు రూ.74000) అందించేందుకు గూగుల్ సిద్ధమైంది.ఇందుకు ‘జనరేషన్‌ గూగుల్‌ స్కాలర్‌షిప్‌‘ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది.

 Google Good News For Students .. If You Select Rs 74 Thousand Yourself Good News-TeluguStop.com

ఈ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకునేందుకు డిసెంబర్ 10వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది.

ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా భారతీయ ఫిమేల్ స్టూడెంట్స్విద్యార్థినులు ఏసియా పసిఫిక్(Asia Pacific) అనే ప్రోగ్రామ్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే మీరు సులభంగా ఈ లింక్ buildyourfuture.withgoogle.com/scholarships/generation-google-scholarship-apac ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ప్రోగ్రామ్‌కు ఎంపిక కావాలంటే ఇప్పటివరకు పూర్తి చేసిన తరగతులలో మంచి స్కోర్ సాధించి ఉండాల్సి ఉంటుంది.మీరు మీ మార్కులతో నింపే ఒక రెజ్యూమ్ తో పాటు ప్రస్తుత లేదా మునుపటి సంస్థల సాంకేతిక ప్రాజెక్ట్‌లు, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, అకడమిక్ ట్రాన్‌స్క్రిప్ట్‌ల పార్టిసిపేషన్ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.

అలాగే ప్రోగ్రామ్‌కు సెలెక్ట్ కావాలంటే విద్యార్థినులు 400 పదాల్లో 2 వ్యాసాలు రాయాల్సి ఉంటుంది.ఈ రెండు వ్యాసాలను ఇంగ్లీష్ భాష లోనే రాయాల్సి ఉంటుంది.అలాగే ప్రస్తుతం విద్యార్థినులు కంప్యూటర్ సైన్స్ డిగ్రీ లో ఫుల్ టైం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గా కొనసాగుతుండాలి.వీటిని వెరిఫై చేయడంలో గూగుల్ తన సొంతంగా ప్రయత్నం చేస్తుంది.

Telugu Thousands, Science, Google, Latest-Latest News - Telugu

స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు సెలెక్ట్ అయిన తర్వాత గూగుల్ 1000 డాలర్లు అందజేస్తుంది.ఈ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్ పూర్తయ్యేలోపు మీరు గుర్తింపు పొందిన ఏదో ఒక ఏషియా పసిఫిక్ దేశంలోని యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతుండాలి.అంతే కాదు గూగుల్ అందిస్తున్న ప్రతి డాలర్ ను కూడా చదువు నిమిత్తమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.రెండు వ్యాసాలు అనేవి విద్యార్థినులకు డైవర్సిటీ, ఇంక్లూషన్, ఈక్విటీ పట్ల వారి నిబద్ధతను అంచనా వేయటంలో ఉపయోగపడతాయి.

అలాగే విద్యార్థినుల ఆర్థిక అవసరాలను తెలుసుకోవడంలో కూడా గూగుల్ కి సహాయ పడతాయి.అందువల్ల అర్హత గల అభ్యర్థుల సెలక్షన్ అనేది వారు రాసే వ్యాసాలపై ఆధారపడి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube