గూగుల్ ఉద్యోగులకు ఇకపై ఇలా: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు  

Google employees will work in hybrid work from home models, says Sundar Pichai, Google, hybrid work from home, Sundar Pichai, Microsoft Billgates, Weekly Off, - Telugu Google, Hybrid Work From Home, Microsoft Billgates, Sundar Pichai, Weekly Off

కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.ఒకప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకే పరిమితమైన ఈ విధానం.

TeluguStop.com - Google Employees Will Work In Hybrid Work From Home Models Says Sundar Pichai

వైరస్ పుణ్యమా అని అన్ని రంగాలకు విస్తరించింది.ఉరుకుల పరుగుల జీవితంలో కుటుంబంతో గడిపేందుకు సమయం లేని వేతన జీవులంతా ఇంటిపట్టునే ఉంటూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సేదతీరుతూనే విధులు నిర్వర్తించారు.

అలాగే కంపెనీలకు సైతం సాధారణ రోజులతో పోలిస్తే ఉత్పాదకత బాగా పెరిగింది.ఈ పరిణామాల నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొన్ని కంపెనీలు శాశ్వతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

TeluguStop.com - గూగుల్ ఉద్యోగులకు ఇకపై ఇలా: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ సైతం ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.తాజాగా ఈ లిస్టులోకి భారత సంతతికి చెందిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేరారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పిచాయ్.గూగుల్ ఉద్యోగులు రానున్న రోజుల్లో హైబ్రిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ తరహాలో పనిచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.తమ సంస్థ అంతర్గతంగా నిర్వహించిన ఓ సర్వేలో 62 శాతం మంది ఉద్యోగులు ఆఫీసులకు తిరిగి రావాలని భావిస్తున్నప్పటికీ.ప్రతిరోజూ వచ్చేందుకు మాత్రం సుముఖత చూపడం లేదని తేలిందని పిచాయ్ పేర్కొన్నారు.

భవిష్యత్తులో మరింత సులభతరమైన పని విధానాలు అందుబాటులో వస్తాయని తాను భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

ఉద్యోగులకు తాముండే ప్రాంతంలోనే సదుపాయాలు కల్పించేందుకు గూగుల్ కార్యాలయాలకు మెరుగులు దిద్దుతామని పిచాయ్ చెప్పారు.అలాగే వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న వారు కొన్ని రోజులకు ఒకసారి ఆఫీసుకు వచ్చి రిపోర్టు చేయాల్సి వుంటుందని ఆయన పేర్కొన్నారు.2021 జూలై వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించిన కంపెనీల్లో గూగుల్‌ కూడా ఒకటన్న విషయాన్ని సుందర్ పిచాయ్ గుర్తుచేశారు.దీంతో పరిస్ధితులకు తగినట్లుగా సాధ్యమైనంత వరకు అనిశ్చితిని తొలగించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు పిచాయ్ పేర్కొన్నారు.

కాగా, కరోనా కారణంగా ఉద్యోగులపై పడుతున్న భారం దృష్ట్యా ఇప్పటికే రెండు రోజులుగా ఉన్న వీక్లీ ఆఫ్‌ను మరో రోజుకు గూగుల్‌ పెంచింది.

ఉద్యోగుల భద్రత, సంక్షేమం విషయంలో ఎప్పుడూ ఓ అడుగు ముందే ఉండే గూగుల్‌ కరోనా కారణంగా తమ ఉద్యోగులకు ఈ బంపరాఫర్ ప్రకటించింది.ముఖ్యంగా ఐదు రోజుల పని దినాల్లోనూ తమ ఉద్యోగులు ఇళ్ల వద్దే ఉండి కూడా పని చేయలేకపోతున్నారని గూగుల్‌ గుర్తించింది.

తమ సంస్ధలో ఇంటర్న్‌గా పనిచేస్తున్న వారితో పాటు శాశ్వత ఉద్యోగులకూ శుక్రవారం ప్రత్యేక వీక్లీ ఆఫ్‌గా ప్రకటిస్తున్నట్గు గూగుల్‌ తెలిపింది.అత్యవసర పరిస్ధితుల్లో ఆ రోజు ఎవరైతే పనిచేస్తారో వారు మరో రోజు సెలవు తీసుకోవచ్చని గూగుల్‌ తెలిపింది.

ఇలా ఉద్యోగులకు వీక్లీ ఆఫ్ కల్పించడంలో మేనేజర్లు కూడా తమ టీమ్‌లకు మద్దతుగా నిలవాలని సూచించిన సంగతి తెలిసిందే.

#HybridWork #Sundar Pichai #Google #Weekly Off

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Google Employees Will Work In Hybrid Work From Home Models Says Sundar Pichai Related Telugu News,Photos/Pics,Images..