లోన్‌ యాప్స్‌కు కొత్త ఆంక్షలు.. ఈ గైడ్‌లైన్స్‌ తప్పనిసరి..!

గూగుల్‌ కొత్త కార్యానికి శ్రీకారం చుట్టింది.ఈ నేపథ్యంలో పర్సనల్‌ లోన్‌ అందించే ప్రైవేటు లోన్‌ లెండర్స్‌కు కఠిన ఆదేశాలను జారీ చేసింది.

 Google Cracksdown New Guidelines To Personal Loan Apps In India-TeluguStop.com

ఆ వివరాలు తెలుసుకుందాం.లోన్‌ యాప్స్‌ ఆ మధ్య కాలంలో చేసిన ఆకృత్యాలు అంతా.

ఇంతా కాదు.వీటికి భయపడి ఆత్మహత్య చేసుకున్నవారు కూడా కోకొల్లాలు.

 Google Cracksdown New Guidelines To Personal Loan Apps In India-లోన్‌ యాప్స్‌కు కొత్త ఆంక్షలు.. ఈ గైడ్‌లైన్స్‌ తప్పనిసరి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వడ్డీ మీద చక్రవడ్డి, బారువడ్డీలు వేస్తూనే.సమయానికి తిరిగి కట్టలేని వారు డీఫాల్టర్స్‌ అంటూ వారి స్నేహితులకు, బంధువులకు ఫోటోలు పంపించి కూడా వేధించేవారు.

ఈ నేపథ్యంలో ఇటువంటి ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయడానికి గూగుల్‌ నడుం బిగించింది.జనవరిలోనే వందల సంఖ్యల్లో ఉన్న చాలా గూగుల్‌ యాప్‌లను తొలగించామని కూడా చెప్పింది.

ఇప్పటి నుంచి పర్సనల్‌ లోన్స్‌ అందించే సదరు యజమానులు గూగుల్‌ జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను పాటించాల్సి ఉంటుంది.ఈ కొత్త పాలసీ విధానం 2021 సెప్టెంబర్‌ 15 నుంచి అమల్లోకి రానుంది.

వారి యాప్‌లు గూగుల్‌ ప్లేస్టోర్‌లో కొనసాగాలంటే ఆ ఆదేశాలు తప్పక పాటించాలని గూగుల్‌ ప్రకటించింది.ఈ ఆంక్షలను భారత్‌తోపాటు ఇండోనేషియాలో కూడా అమలు చేయనుంది.

గూగుల్‌ గైడ్‌లైన్స్‌…

Telugu Complaints About Loan Apps, Declaration Registered Business, Google App, Google New Guide Lines, Google Playstore, Google Restrictions, Loan Application, Loan Apps, Play Store, Rbi-Latest News - Telugu

భార త పర్సనల్‌ లోన్‌ యాప్‌ డిక్లరేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.దీనికి అవసరమైన అన్ని దస్తావేజులను సదరు యజమానులు సమర్పించాల్సి ఉంటుంది.ఉదా.ఆర్‌బీఐ నుంచి ఒక పర్సనల్‌ లోన్‌ యాప్‌ కోసం లైసెన్స్‌ పొందే కాపీని గూగుల్‌ రివ్యూ కోసం ఆ కాపీని అందించాల్సి ఉంటుంది.‘కేవలం నేరుగా రుణాలను డబ్బును ఇచ్చే కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండకుండా.రిజిస్టర్డ్‌ నాన్‌ బ్యాంకింగ్‌ కంపెనీల లేదా బ్యాంకుల ద్వారా వినియోగదారులకు మని లెండింగ్‌ను సులభతరం చేయడానికి మాత్రమే ఒక వేదికను అందిసున్నాం ’అనే సమాచారం వారి ప్రకటనలో కచ్చితంగా లిఖితపూర్వకంగా ఉండాలని గూగుల్‌ ఆదేశించింది.

రకరకాల లోన్‌ యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి.షయోమి, రియల్‌మే వంటి వారు థర్డ్‌ పార్టీ లెండింగ్‌ సర్వీసులు అందించేవారికి కూడా ఇది వర్తిస్తుంది.

Telugu Complaints About Loan Apps, Declaration Registered Business, Google App, Google New Guide Lines, Google Playstore, Google Restrictions, Loan Application, Loan Apps, Play Store, Rbi-Latest News - Telugu

అంతేకాదు డిక్లరేషన్‌లో రిజిస్టర్డ్‌ బిజినెస్‌కు సంబంధించిన డెవలపర్‌ ఖాతా నంబర్‌ కచ్చితంగా ఉండాలి.కేవలం లోన్‌ తీసుకున్న రోజు నుంచి 60 రోజులు అంతకు ఎక్కువ రోజుల గడువు అందించే కంపెనీలకు మాత్రమే అనుమతిస్తామని జనవరిలోనే గూగుల్‌ ప్రకటించింది.బ్లాగ్‌లో కనిష్ట లేదా గరిష్ట వడ్డీ రేట్లను, గడువు రోజులను క్లియర్‌గా ఇన్ఫర్మేషన్‌ అందించేలా ఉండాలి.ఈ పాలసీలకు లోబడి ఉండని యాప్‌లను తొలగించేస్తామని దిగ్గజ గూగుల్‌ తెలిపింది.

అంతేకాదు కేసు దర్యాప్తులో చట్టం అమలు చేయడానికి తమవంతు సాయం కూడా చేస్తామని చెప్పింది.వినియోగదారులకు లోన్‌ ఫీజ్‌ రీపేమెంట్, రిస్క్, లాభాలను వారు లోన్‌ తీసుకునేముందే ఇన్ఫర్మేషన్‌ అందించాలని తెలిపింది.

అంటే మార్టిగేజ్‌ లోన్, స్టూడెంట్‌ లోన్, కార్‌ లోన్స్, లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ వంటివి పర్సనల్‌లో పొందుపరచకూడదు.

#Google App #Loan #Loan Apps #Play Store #ComplaintsLoan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు