సరికొత్త అప్డేట్ ను ప్రవేశ పెట్టిన గూగుల్ క్రోమ్..!

వెబ్ సైట్ లింకులు అతిత్వరగా యాక్సెస్ చేయాలనే ఉద్దేశంతో క్యూఆర్ కోడ్ లను టెక్ నిపుణులు రూపొందించారు.అంతకుముందు వెబ్సైట్ యుఆర్ఎల్ లను కాపీ చేసి.

 Google Chrome, New Update, Create Qr Code, New Security, Chrome, Phone Settings,-TeluguStop.com

పేస్ట్ చేసి కావాల్సిన ప్రాంతాల్లో అతికించేవారు.కానీ ఆ యుఆర్ఎల్ చూస్తూ ఫోన్ లో గానీ కంప్యూటర్ లో గానీ టైపు చేసి వెబ్సైట్ ని యాక్సెస్ చేయడం చాలా ఆలస్యం అయ్యేది.

దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టాలని క్యూఆర్ కోడ్స్ లను అందుబాటులోకి తెచ్చారు.ఏ వస్తువుపై అయినా.

ఏ షాపు పై అయినా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే క్షణాల్లో మనకు వారి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.నిజానికి 4,296 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ల తో క్యూఆర్ కోడ్ లను తయారు చేస్తారు.

లేదా 7,089 అంకెలను చిన్న క్యూఆర్ లో స్టోర్ చేసేసి తమ వినియోగదారుల పనులను సులభతరం చేస్తున్నారు.అయితే అటువంటి క్యూఆర్ కోడ్ లను క్షణాల్లోనే మన కంప్యూటర్ లేదా మొబైల్ లోనే జనరేట్ చేయొచ్చు.

కంప్యూటర్ లో ఎలా క్యూఆర్ కోడ్ జనరేట్ చేయాలో చూద్దాం.మొదటగా కంప్యూటర్ లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి chrome://flags/#sharing-qr-code-generator అని సెర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ నొక్కాలి.ఆ తర్వాత క్యూఆర్ ఆప్షన్ ని ఎనేబుల్ చేయాలి.అనంతరం బ్రౌజర్ ని రీ లాంచ్ చేస్తే మీ బ్రౌజర్ లోనే సులువుగా క్యూఆర్ కోడ్ జనరేట్ చేయొచ్చు.

ఇందుకోసం మీరు ఏదైతే వెబ్ పేజీని క్యూఆర్ కోడ్ గా మార్చాలి అనుకుంటున్నారో.ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేసి రైట్ – క్లిక్ ఇవ్వాలి.

అప్పుడు ఓపెన్ అయిన డ్రాప్ డౌన్ మెనూ నుంచి Create QR code for this page ఆప్షన్‌ పై క్లిక్‌ చేస్తే వెంటనే ఆ పేజీకి క్యూఆర్‌ కోడ్‌ వచ్చేస్తుంది.ఈ కోడ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా షేర్ ఆప్షన్ ఉపయోగించి ఇతరులతో పంచుకోవచ్చు.

ఇక మొబైల్లో చూస్తే.క్రోమ్ బ్రౌజర్/ chrome dev బ్రౌజర్ ఓపెన్ చేసి మీకు కావలసిన వెబ్ పేజీ ని ఓపెన్ చేసి.కుడి వైపు పైభాగంలో కనిపిస్తున్న 3 డాట్స్ పై క్లిక్ చేయాలి.ఆ తర్వాత ఆప్షన్లలో షేర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

అప్పుడు వచ్చిన ఆప్షన్ లో నుంచి క్రియేట్ క్యూఆర్‌ కోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే వెంటనే మీకు అవసరమైన క్యూఆర్‌ కోడ్ వచ్చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube