అమెరికా: భారత రాయబారితో సుందర్ పిచాయ్ భేటీ... తొలిసారి ఇండియన్ ఎంబసీకి గూగుల్ సీఈవో

గూగుల్ సీఈవో, భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్.అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని ఇండియన్ ఎంబసీని సోమవారం సందర్శించారు.

 Google Ceo Sundar Pichai Meets India’s Ambassador To The U.s Taranjit Singh Sa-TeluguStop.com

తొలిసారిగా భారత దౌత్య కార్యాలయానికి వచ్చిన ఆయన.భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూతో భేటీ అయ్యారు.అనంతరం ఇండియాలో గూగుల్ కార్యకలాపాలపై, భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న డిజిటలైజేషన్‌లో గూగుల్ పోషిస్తున్న కీలకపాత్రపై సుందర్ పిచాయ్ వివరించారు.

అనంతరం ఈ భేటీకి సంబంధించిన వివరాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్న పిచాయ్.

తరణ్‌జిత్‌కు ధన్యవాదాలు తెలిపారు.భారతదేశ డిజిటల్ భవిష్యత్తుకు సహాయం చేస్తామని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అటు సుందర్ పిచాయ్‌తో తరణ్‌జిత్ భేటీకి సంబంధించి భారత రాయబార కార్యాలయం కూడా ఒక ప్రకటనలో తెలిపింది.ఇరుదేశాల మధ్య పలు రంగాల్లో సహాయ సహకారాలకు సంబంధించి గూగుల్‌ వేదికగా వుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

Telugu Googleceo, Naredra Modi, Taranjitsingh, Piyush Goyal-Telugu NRI

ఇకపోతే.దేశ పురోభివృద్ధిని దృష్టిలో వుంచుకుని మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా అమెరికన్ సీఈవోలతో కలిసి నడవాలని భావిస్తోంది.

ఇటీవల అగ్రరాజ్య పర్యటనకు వెళ్లిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అక్కడి సీఈవోలతో భేటీ అయ్యారు.వీరిలో భారత సంతతికి చెందిన వారూ వున్నారు.

మరోవైపు గూగుల్ భారత్‌లో కార్యకలాపాలను విస్తరిస్తోంది.ప్రధాని నరేంద్ర మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తోన్న డిజిటల్ ఇండియాలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ ముందుకొచ్చింది.

అలాగే భారత టెలికాం దిగ్గజాలైన జియో, ఎయిర్‌టెల్‌తోనూ కలిసి పనిచేస్తోంది.ఈ నేపథ్యంలో భారత రాయబారితో సుందర్ పిచాయ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube