వామ్మో.. లక్షల సంఖ్యలో యాప్స్ ను డిలీట్ చేసే క్రమంలో గూగుల్, ఆపిల్ కంపనీలు..?!

గూగుల్, యాపిల్ కంపనీలు కలిసి కొన్ని రకాల యాప్స్ పై నిషేధం విధించే పనిలో పడ్డాయి.కొన్ని రకాల భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

 Google, Apple Companies In Order To Delete Millions Of Apps, Google, Apple, Play-TeluguStop.com

ఒకటి కాదు రెండు కాదు సుమారు 8 లక్షల యాప్స్ ను గూగుల్ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి నిషేధం విధించాయి.పిక్సలేట్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ సంస్థ తెలిపిన ఒక నివేదిక ప్రకారం ఈ యాప్స్ పై కొరడా విధించారు.‘H1 2021 డీలిస్టెడ్‌ మొబైల్ యాప్స్‌ రిపోర్ట్‌‘ పేరుతో పిక్సలేట్‌ తయారుచేసిన నివేదికలో ఈ 8,13,000 యాప్‌ లు బయటపడ్డాయి.

ఇదిలా ఉండగా ఈ నివేదికలో పేర్కొన్న యాప్‌ లకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 21 మిలియన్‌ యూజర్‌ రివ్యూలు ఉండడం విశేషం అనే చెప్పాలి.

ఎందుకంటే ఈ నిషేధిత యాప్‌ లను ఇప్పటిదాకా ఎంతో మంది యూజర్స్ ఉపయోగిస్తున్నట్లు పిక్సలేట్ నివేదికలో తెలిపింది.కానీ ఈ యాప్స్ అంత సురక్షితమైనవి కాదని తెలుస్తుంది.

ఎందుకంటే ఈ యాప్‌ లు కెమెరా, జీపీఎస్‌ వంటి ద్వారా యూజర్ యొక్క డేటాను సేకరిస్తున్నట్లు ఈ నివేదికలో వెల్లడించారు.అలాగే 86% యాప్‌ లు 12 ఏళ్లలోపు పిల్లలను టార్గెట్ గా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది.

కాగా ఈ నిషేధిత యాప్‌ ల జాబితాను తయారుచేసే క్రమంలో ముందుగా ప్లేస్టోర్‌, యాప్‌ స్టోర్‌ లలో దాదాపు 5 మిలియన్ యాప్‌ లను విశ్లేషించినట్లు పిక్సలేట్ సంస్ధ తెలిపింది.

Telugu Lakhs, Apple, Delete, Google, Store-Latest News - Telugu

అలాగే ఇప్పటికి ఈ నిషేదించిన యాప్స్ ఇంకా యూజర్ల ఫోన్లలో ఉండి ఉంటాయని పిక్సలేట్ అభిప్రాయ పడుతుంది.ఒకవేళ అలా ఎవరి ఫోన్లలో అయినా ఈ నిషేధిత యాప్స్ కనుక ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేయాలని సూచించింది.మరి నిషేధిత యాప్ లు ఫోన్‌ లో ఉన్నాయో లేదో అని తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా.? అయితే ఇలా తెలుసుకోండి.ముందుగా మీ ఫోన్‌ లో ఉన్న యాప్‌ పేరు ప్లేస్టోర్‌, యాపిల్ స్టోర్‌లో టైప్‌ చేయండి.

మీరు టైప్ చేసిన యాప్‌ కనుక మీ ఫోన్ లోని యాప్ స్టోర్‌ లలో కనిపిస్తే అది నిషేధిత యాప్‌ కాదు.ఒకవేళ మీరు టైప్ చేసిన యాప్ పేరు లేకపోతే వెంటనే మీ ఫోన్ లో ఉన్న యాప్‌ ను డిలీట్ చేసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube