ఇక నుంచి ఆ మొబైళ్లల్లో గూగుల్, యూట్యూబ్ సేవలు బంద్.. ఎందుకంటే..?

మానవుని రోజు వారీ జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక భాగమైపోయింది.దాంతో ఇప్పుడు ప్రతిఒక్కరికి స్మార్ట్ మొబైల్లు లేని వారుంటూ ఉండరు.

 Google And Youtube Services Will Be Stopped In This Mobiles Because-TeluguStop.com

అయితే ఆ మొబైళ్లల్లో కొన్ని వేల యాప్ లు ఉపయోగిస్తూ ఉంటారు.అందులో ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తున్న అతి పెద్ద సెర్చ్ ఇంజన్ గూగుల్.

దానికి సంబంధించిన యాప్ లు అయిన యూట్యూబ్, జీమెయిల్ వంటి వాటిల్లో సేవలను సెప్టెంబర్ 27 నుంచి బంద్ చేస్తున్నట్లు గూగుల్ పేర్కొంది.గూగుల్ కి సంబంధించిన యాప్స్ కొన్ని మొబైళ్లల్లో పనిచేయవని, అలాంటి మొబైళ్లలో వినియోగదారులు తమ ఫోన్ ను అప్డేట్ చేసుకోవాలని లేదా కొత్త మొబైల్ ఫోన్ అయినా వాడాలని తెలిపింది.

 Google And Youtube Services Will Be Stopped In This Mobiles Because-ఇక నుంచి ఆ మొబైళ్లల్లో గూగుల్, యూట్యూబ్ సేవలు బంద్.. ఎందుకంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గూగుల్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ లో 11 వర్షన్, ఐఫోన్ లలో ఐఓఎస్ 15 నడుస్తోంది.2010 నుంచి గూగుల్ ఒక్కో వర్షన్ ను విడుదల చేస్తోంది.దీంతో వినియోగదారుల భద్రత, డేటా, పరిరక్షణ అంశాల్ని దృష్టిలో పెట్టుకుని గూగుల్ నేటి నుండి ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్ లేదా అంతకంటే తక్కువ వర్షన్ గల మొబైల్ ఫోన్ లలో గూగుల్ సేవలు నిలిపి వేస్తున్నట్లు తెలిపింది.అందుకే వినియోగదారులు పాత్ ఫోన్లను వినియోగిస్తున్నట్లు అయితే వెంటనే తమ ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయాకోవాల్సిందేనని లేకపోతే కొత్త మొబైళ్లను కొనాల్సిందేనని తెలిపింది.

Telugu Android 2.3 Version Mobiles, Gmail, Google, Hackers, Latest News, Lg Spectrum, Mobile Phone, Samsung Galaxy Se, Services, Services Stop, Sony Xperia P, Technology Updates, Youtube-Latest News - Telugu

పాత వర్షన్ ల వల్ల హ్యాకర్లు రెచ్చిపోతుండడంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.2017 లో ఆండ్రాయిడ్ 2.3 వర్షన్ ఫోన్లకు గూగుల్ పే సేవలు నిలిపేసింది.ఆండ్రాయిడ్ 2.3 వర్షన్ తో ఇప్పటికి నడుస్తున్న ఫోన్ల జాబితాకు సంబంధించి కొన్ని ఉన్నాయి.అవి Sony Xperia Advance, Kenobi k800, sony Ceria Go, Vodafone Smart, Samsung Galaxy SE, Sony Xperia P, LG Spectrum, Sony Expedia S, LG Prada 3.0, HTC Velocity, HTC Evo 4G, Motorola Fire, Motorola XT532 ఇంకా ఇలా చాలా ఉన్నాయి.

#LG Spectrum #Hackers #Android Mobiles #Youtube #Google

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు