వాట్సాప్ కి పోటి వచ్చేసింది

సెర్చ్ ఇంజన్ అనే పేరు ఎత్తితే మొదట గూగుల్ మాత్రమే గుర్తుకువస్తుంది.యాహూ, బింగ్ లాంటివి ఎన్ని వచ్చినా, గూగుల్ దరిదాప్పుల్లోకి కూడా రాలేకపోయాయి.

 Google Allo – A Firm Competition To Whatsapp-TeluguStop.com

ఈమేయిల్ రంగంలోనూ అంతే, జీమేయిల్ కి పోటే లేదు.ఇక వీడియో సెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

యూట్యూబ్ ని తట్టుకోని నిలవడటం ఎవరి తరం కాదు.,అంతటా తమదే ఆధిపత్యం ఉండాలనుకుంటున్న గూగుల్ వీడియో కాలింగ్ లో స్కైప్ కి పోటిగా గూగుల్ డ్యుయో ని రంగంలోకి దింపి, ఇప్పుడు వాట్సాప్ మార్కేట్ ని కొల్లగొట్టే ప్లాన్ లో గూగుల్ అల్లో (Google Allo) అనే మెసేంజర్ ని విడుదల చేసింది.

వాట్సాప్ లో లేని కొన్ని ఫీచర్స్ తో, పూర్తిగా గూగుల్ బ్రాండింగ్ తో అల్లోని తయారుచేసింది గూగుల్ సంస్థ.ఇందులో ఇన్ బిల్ట్ గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది.

ఇది వాతావరణ వివరాలు, ప్రపంచ వార్తలు, రెస్టారెంట్లు, విమానాలు, గేమ్స్, గూగుల్ ట్రాన్స్ లేషన్ లాంటి సేవలతో పాటు, అలరమ్, రిమైండర్ సేవలు అందిస్తుంది.

టెక్ట్ సైజ్ ని చిన్నగా, పెద్దగా పంపడం, పెద్ద స్టికర్స్, రిప్లై సజెషన్స్, ఇమేజ్ లపై డ్రాయింగ్ వేసే ఫీచర్ లాంటి అదనపు ఫీచర్లు దీంట్లో ఇచ్చారు.

ఇక అన్నిటికి మించి, ముఖ్యంగా వాట్సాప్ లేని ఫీచర్, అల్లో లో ఉన్న ఫీచర్ Incognito Mode (సీక్రేట్ చాటింగ్).సో, మీరు ఏదైనా ప్రైవేయిట్ గా, సీక్రేట్ గా చాట్ చేయాలనుకున్నా చేయొచ్చు.

ఇది అండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఆయా స్టోర్స్ లో అందుబాటులోకి వచ్చింది.ఇంకెందుకు ఆలస్యం .డౌన్లోడ్ చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube