ప్రాణాంతక కిడ్నీ వ్యాధి.. తల్లి ఎదురుచూపులు: విద్యార్థికి అండగా ఆస్ట్రేలియా, స్పెషల్ ఫ్లైట్‌లో ఇండియాకి

ఆస్ట్రేలియా ప్రభుత్వం తన పెద్ద మనసు చాటుకుంది.ప్రాణాంతక మూత్రపిండ వ్యాధితో బాధపుడతున్న భారత విద్యార్థి కోసం ఏకంగా ప్రత్యేకంగా విమానాన్ని ఏర్పాటు చేసి అతనిని స్వదేశానికి పంపింది.

 Goodwill Gesture Australia Airlifts Indian Student Suffering From Kidney Disorde-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.భారత్‌కు చెందిన 25 ఏళ్ల అర్ష్దీప్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో చదువుకుంటున్నాడు.

ఈ క్రమంలో అతను ప్రాణాంతక క్రోనిక్ రీనల్ ఫేల్యూర్తో బాధపడుతున్నాడు.అయితే ఇంటికి తిరిగి వద్దామంటే ప్రయాణాలపై ఆంక్షల కారణంగా విమానాలు నడవటం లేదు.

పరిస్థితి కుదుటపడుతున్న దశలో ఆస్ట్రేలియాలో డెల్టా వేరియెంట్ విజృంభించడంతో ఆ దేశానికి కొన్ని దేశాలు విమాన రాకపోకలు నిషేధించాయి.

ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్ ఆరోగ్యం మరింత క్షీణించసాగింది.

దీంతో అతని తల్లి ఇంద్రజీత్ కౌర్ తన బిడ్డకు సాయం చేయాల్సిందిగా భారత్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.అలాగే అర్ష్‌దీప్‌ను భారత్కు తిరిగి పంపించాలని ఇండియన్ వరల్డ్ ఫోరమ్ కూడా విజ్ఞప్తి చేసింది.

దీనిపై స్పందించిన ఆసీస్ ప్రభుత్వం.అర్ష్దీప్ స్వదేశానికి చేరుకోవడానికి ఆదివారం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది.

భారత ప్రభుత్వ సమన్వయంతో క్వాంటస్ విమానంలో అతడి కోసం అత్యవసర వైద్య పరికరాలనూ అందుబాటులో ఉంచింది.ఇరు ప్రభుత్వాలు, అధికారుల కృషితో అర్ష్‌దీప్ ఆదివారం సాయంత్రానికి న్యూఢిల్లీ చేరుకున్నాడు.

అనంతరం అతనిని హర్యానా రాష్ట్రం గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.తమ బిడ్డ చాలా రోజులు తర్వాత భారత్‌కు తిరిగిరావడం పట్ల అర్ష్‌‌దీప్ తల్లి ఇంద్రజీత్ కౌర్ సంతోషం వ్యక్తం చేశారు.

అతడికి వెంటనే చికిత్స అందించి, డయాలసిస్ ప్రారంభించినందుకు ఆస్ట్రేలియా, భారత ప్రభుత్వాలు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, రెండు నెలల క్రితం భారత్‌లోని భయానక పరిస్ధితుల నేపథ్యంలో అక్కడి వేరియెంట్ తమ దేశంలో ప్రవేశించకుండా పలు దేశాలు విమాన ప్రయాణాలు నిషేధించాయి.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా విధించిన నిషేధం ఎన్ని విమర్శలకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్కనక్కర్లేదు.హద్దు మీరి స్వదేశంలో అడుగు పెడితే జైలు శిక్షతో పాటు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube