భువనగిరి సమీపంలో సాంకేతిక కారణాలతో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. !  

goods train derailed due to technical reasons, bhuvanagiri, Goods train, derailed, technical reasons - Telugu Bhuvanagiri, Derailed, Goods Train, Technical Reasons

రైలు ప్రయాణంలో ఇబ్బందులు చాల తక్కువగా ఉంటాయని భావిస్తారు కొందరు.కానీ వేగంగా వెళ్లే రైలు పట్టాలు గనుక తప్పితే ఇంకేమైనా ఉందా.

TeluguStop.com - Goods Train Derailed Due To Technical Reasons

అయిన ఈ మధ్య కాలంలో ఎక్కడికైనా ప్రయాణించాలంటే ఒంట్లో భయం కలుగుతుంది.క్షేమంగా గమ్యస్దానికి చేరుతామనే నమ్మకం కూడా కలగడం లేదు.

ఇదిసరే గానీ గుంటూరు నుండి సికింద్రాబాద్‌ వెళ్తున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన సంఘటన చోటు చేసుకుంది.ఇది ప్రయాణికులు ఉండే రైలు కాదు కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ అటు వైపుగా వెళ్లే రైళ్లకు మాత్రం కాస్త ఇబ్బంది కలిగిందట.

TeluguStop.com - భువనగిరి సమీపంలో సాంకేతిక కారణాలతో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ వార్తను పూర్తిగా తెలుసుకుంటే.

యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద ఈ గూడ్స్‌ రైలు గురువారం అంటే ఈరోజూ పట్టాలు తప్పింది.

కాగా ప్రమాదం కారణంగా మూడు బోగీలు ట్రాక్‌ దిగి సమీపంలోని పొదల్లోకి దూసుకెళ్లాయట.ఇక ప్రమాద ఘటన తాలూకు సమాచారం అందుకున్న రైల్వే అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నమని వెల్లడించారు.ఈ ఘటనతో ఆ మార్గంలో వెళ్లే ఇతర రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా వెంటనే మరమ్మతులు చేపట్టారు.

#Bhuvanagiri #Derailed #Goods Train

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు