పట్టాలపై నిద్రిస్తున్న కార్మికులపై దూసుకెళ్లిన రైలు

మహారాష్ట్రలో దారుణం జరిగింది.ఔరంగాబాద్‌ నుండి నాందెడ్‌కు వెళ్తున్న వలస కార్మికులు రాత్రి అవ్వడంతో రైలు పట్టాలపై పడుకున్నారు.

 Train Hit The Daily Wages Workers, Maharastra, Daily Wahes Workers Sleep On Trac-TeluguStop.com

రైల్లు పూర్తిగా బంద్‌ ఉన్న కారణంగా ఏ రైలు రాకపోవచ్చు అనుకున్నారు.కాని ఆ సమయంలో గూడ్స్‌ రైలు రావడంతో పట్టాలపై పడుకున్న 15 మంది మృతి చెందారు.

రైలు వచ్చే విషయాన్ని గుర్తించకుండా గాఢ నిద్రలో ఉన్న ఆ 15 మంది మృత దేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు మరియు రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలను హాస్పిటల్‌కు తరలించారు.

కొందరి మృతదేహాలు కనీసం గుర్తించడానికి కూడా లేకుండా పోయాయి.

ఈ సంఘటనపై ప్రభుత్వం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది.

కర్మాడ్‌ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.లాక్‌డౌన్‌ కారణంగా చేస్తున్న పని పోవడంతో వలస కార్మికులు కాలి నడకన సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు.

మార్గ మద్యంలో రోడ్లపైనే నిద్రస్తూ వారి ప్రాంతానికి వెళ్తున్నారు.ఈ సమయంలో వారు తాజాగా రాత్రి సమయంలో రైలు పట్టాలపై నిద్రించారు.

లాక్‌డౌన్‌ కారణంగా రైలు అన్ని కూడా ఆపేయడం వల్ల ఏ రైలు ఆ మార్గంలో రాకపోవచ్చు అని వారు పొరపాటు పడ్డారు. కాని అటుగా వెళ్తున్న ఖాళీ గూడ్స్‌ రైలు వారి జీవితాలను చిది మేసింది.

ఈ సంఘటపై రైల్వే శాఖ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube