లాస్ ఏంజెల్స్: అద్దెదారులకు ఊరట.. కారణం లేకుండా తొలగింపుపై తాత్కాలిక నిషేధం

అద్దెకు ఉంటున్న వారిని ఇంటి యజమానులు కారణం లేకుండా వెళ్లగొట్టడంపై లాస్ ఏంజెల్స్ సిటీ కౌన్సిల్ తాత్కాలిక నిషేధాన్ని విధించింది.మంగళవారం జరిగిన సిటీ కౌన్సిల్ సమావేశంలో ఇందుకు సంబంధించిన తీర్మానంపై చర్చ జరిగింది.

 Goodnews For Rentpayinghouse Holders In Los Angeles-TeluguStop.com

అనంతరం సభ్యులు ఈ తీర్మానాన్ని 14-0 ఓట్ల తేడాతో ఆమోదించారు.దీని ప్రకారం కారణం లేకుండా అద్దెదారులను ఇంటి నుంచి వెళ్లగొట్టరాదు.

అద్దె చెల్లించకపోవడం లేదా నేర ప్రవృత్తి కలిగి ఉన్నారన్న అభియోగాలపై అద్దెదారులను బయటకుపంపవచ్చని కౌన్సిల్ తెలిపింది.

గత నెలలో అద్దెను పెంచేందుకు వీలు కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానించిన 1482 బిల్లుకు గవర్నర్ గావిన్ న్యూసమ్ సంతకం చేసిన తర్వాత అద్దెదారులపై వేధింపులు పెరిగాయని అద్దెదారుల సంఘాలు మీడియాకు తెలిపాయి.

రెంట్ అగ్రిమెంట్‌ను ఉన్నపళంగా రద్దు చేసేందుకు, అద్దెదారులు ఏ తప్పు చేయకపోయినా బయటకి వెళ్లగొట్టేందుకు 1482 చట్టం యజమానులకు వీలుకల్పిస్తుందని పలువురు నిరసన వ్యక్తం చేశారు.

Telugu Los Angeles, Holderslos, Telugu Nri Ups-

  కాలిఫోర్నియా ప్రభుత్వం అద్దెదారుల తొలగింపుతో పాటు అద్దె పెంపుపై వచ్చే ఏడాది నుంచి కొత్త ఆంక్షలను అమలు చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.గవర్నర్ కొత్త చట్టానికి ఆమోదముద్ర వేసినప్పటి నుంచి యజమానులు … అద్దెదారులకు తొలగింపు నోటీసులు జారీ చేస్తున్న సంఘటనలు ఎక్కువయ్యాయని, దానితో పాటు ఇష్టమొచ్చిన రీతిలో అద్దెలు పెంచుతున్నారని హౌసింగ్ లాయర్లు చెబుతున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube