కాంగ్రెస్ కు దాసోజు శ్రవణ్ గుడ్ బై ? రాజగోపాల్ రెడ్డి బాటేనా ? 

తెలంగాణ కాంగ్రెస్ లో వరుస కుదుపులు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి.మొన్నటి వరకు పార్టీలో చేరికలతో మంచి జోష్ లో ఉండగా, ఇప్పుడు ఒక్కో నేత కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరుతుండడం ఆ పార్టీ నేతల్లో ఆందోళన పెంచుతోంది.

 Goodbye Dasoju Shravan To Congress,telangana Congress, Bjp, Telangana Bjp, Aicc,-TeluguStop.com

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉంటూ, బిజెపి వైపు అడుగులు వేస్తున్నారు.రాబోయే ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందన కొన్ని కొన్ని సర్వే నివేదికలు , కేంద్రంలో మరోసారి బిజెపికే అవకాశం ఉందనే అంచనాలు వేసుకుంటున్న చాలామంది నేతలు ఇప్పుడు బిజెపి బాట పడుతున్నారు.

ఇప్పటికే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు .నేడు ఢిల్లీకి వెళ్తున్న రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరే అవకాశం కనిపిస్తోంది.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ,ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం.2018 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసిన శ్రావణ్ ఓటమి చెందారు.అయితే టీఆర్ఎస్ కార్పొరేటర్ గా ఉన్నదివంగత పీజేఆర్ కుమార్తె విజయ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో, అప్పటి నుంచి శ్రవణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఈ కమంలోనే ఆయన రాజీనామాను ప్రకటించినట్లు తెలుస్తోంది.

దాసోజు శ్రావణ్ బిజెపిలో చేరతారని ప్రచారం జరుగుతోంది .అదే జరిగితే వరుసగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ రాబోయే రోజుల్లో మరిన్ని వలసలతో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Telugu Aicc, Chandrababu, Dasoju Sravan, Komatirajagopal, Pcc, Telangana Bjp, Vi

ఇప్పటికే బీజేపీ చేరికలపై పూర్తిగా ఫోకస్ పెట్టింది .చేరికల కమిటీ కన్వీనర్ గా ఈటెల రాజేందర్ ను నియమించారు.దీనిలో భాగంగానే కాంగ్రెస్ కు చెందిన చాలామంది బిజెపిలో చేరుతుండడం కాంగ్రెస్ లో చేరుతుండడం ఆందోళన పెంచుతుంది.కేవలం కాంగ్రెస్ నుంచి మాత్రమే కాకుండా టీఆర్ఎస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించడం అటు అధికార పార్టీ టిఆర్ఎస్ కు కంగారు పుట్టిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube