బిగ్ అప్డేట్ ఇచ్చిన అడవి శేష్.. ఈ నెలలోనే అది?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అడవి శేష్ ఎంపిక చేసుకొనే కథలు ఎంతో విభిన్నంగా ఉంటాయి.

 Goodachari Movie Team Given The Big Update Is It With In This Month-TeluguStop.com

ఇతని సినిమా వస్తుందంటే అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు.ఇప్పటి వరకు అడవి శేష్ ఇలాంటి విభిన్న కథాంశంతో తెరకెక్కిన సినిమాలలో నటించి విశేష ఆదరణ దక్కించుకున్నాడు.

ఇప్పటివరకు అడవి శేష్ నటించిన సినిమాలలో “గూడచారి” సినిమా గురించి ఎంతో చెప్పుకోవాల్సి ఉంటుంది.తక్కువ బడ్జెట్ తో హాలీవుడ్ సినిమా మార్క్ ను చూపించిన గూడచారి సినిమాకు సీక్వెల్ గా చేస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి.

 Goodachari Movie Team Given The Big Update Is It With In This Month-బిగ్ అప్డేట్ ఇచ్చిన అడవి శేష్.. ఈ నెలలోనే అది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే గూడచారి సినిమా మొదటి పార్ట్ వచ్చి సరిగ్గా నేటితో మూడు సంవత్సరాలను పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే అడవి శేష్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు.

ఆగస్టు నెలలో గూడచారి సినిమా గురించి బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.ఆగస్టు నెల తనకు ఎంతో స్పెషల్ అని.ఈ క్రమంలోనే ఈ నెలలో ఒక పెద్ద అప్డేట్ ఇవ్వబోతున్నట్లు అడవి శేష్ హింట్ ఇచ్చారు.ఈ విధంగా ఈ విషయాన్ని అడవి శేష్ ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ నెలలో హీరో ఎలాంటి సమాచారం ఇవ్వబోతున్నారు అంటూ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

#Big #Goodachari #AdaviSesh #Goodachari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు