మంచినీళ్లు ఈ సమయాల్లో ఖచ్చితంగా తాగాలి

రోజుకి ఇన్నిసార్లు మంచినీళ్ళు తాగాలని ఏ శాస్త్రవేత్త చెప్పలేడు.ఎంత తాగాలి అనే విషయం మీద మాత్రం క్లారిటి ఉంది.మగవారైతే రోజుకి 3.5 – 3.7 లీటర్లు, ఆడవారైతే రోజుకి 2.5 – 2.7 లీటర్ల నీళ్ళు తాగాలని మనకి తెలుసు.కాని మంచినీళ్ళు ఎప్పుడెప్పుడు తాగాలనే విషయం మీదే చాలామందికి అవగాహన ఉండదు.

 Good Timings For Water Intake-TeluguStop.com

కేవలం దాహం చేసినప్పుడే తాగుదామని అనుకుంటారు.కాని అది పద్ధతి కాదు .కొన్ని సమయాల్లో దాహం వేసినా, వేయకున్నా మంచినీళ్ళు తీసుకోవాలి.మరి ఆ సమయాలేంటో, ఎప్పుడెప్పుడు ఏ అవసరం కోసం మంచినీళ్ళు తాగాలో ఇప్పుడు చూద్దాం.

* ఉదయం లేవగానే తొలి అయిదు పది నిమిషాల్లో మంచినీళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి.అలా ఎందుకు అంటే గత ఏడేనిమిది గంటలుగా మన శరీరంలో వాటర్ కంటెంట్ లేకపోవడం వలన శరీరం డీహైడ్రైట్ అయిపోయి ఉంటుంది.

ఎలాగైతే పెట్రోల్ లేని బండిని నడపాలనుకోవడం మూర్ఖత్వమో, మంచినీళ్ళు తాగకుండా రోజువారి పనులు మొదలుపెట్టాలనుకోవడం కూడా మూర్ఖత్వమే.

* ఆహరం తీనే సమయంలో నీళ్ళు తాగే బదులు, భోజనానికి అరగంట ముందు మంచినీళ్ళు తాగాలి.

అప్పుడే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి కడుపులో కొన్ని ఆసిడ్స్ విడుదల అవుతాయి.

అదే సమయంలో మంచినీళ్ళు తాగడం వలన ఆ ప్రాసెస్ కి ఆటంకం కలుగుతుంది.అంతేకాదు, వాటర్ కంటెంట్ ఎక్కువగా అందుతుండటం వలన భోజనం సరిగా చేయలేం.

భోజనం పూర్తయిన అరగంట తరువాత మళ్ళీ నీరు తాగాలి.

* స్నానానికి ముందు కూడా మంచినీళ్ళు తాగాలని సూచిస్తారు డాక్టర్స్.

ఇలా చేయడం వలన రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది అంట.స్నానం చేయడానికి కూడా తగినంత శక్తి కావాలి .అందుకోసమైన మంచినీళ్ళు తాగాలి.నీళ్ళే ఎందుకు భోజనం తరువాత స్నానం చేయొచ్చుగా అని అనుకోకండి .భోజనం అయినవెంటనే ఎప్పుడూ కూడా మంచినీళ్ళు తాగకూడదు.

* వ్యాయామానికి ముందు మంచినీళ్ళు ఖచ్చితంగా తాగాలి.

ఎందుకంటే ఏ వర్కవుట్ అయినా సరే, శరీరం హైడ్రేటెడ్ గా లేకపోతే చేయడం కష్టం.అందుకే స్పోర్ట్స్ పర్సన్స్ అంతా వర్కవూట్ కి ముందు నీరు తాగుతారు, అలాగే వర్కవుట్ పూర్తయిన తరువాత కూడా నీళ్ళు తాగుతారు.

* అలసటగా ఉన్నప్పుడు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు, నిద్రపోవడానికి ముందు (ఒక గ్లాసు చాలు) మంచినీళ్ళు తాగాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube