ప్ర‌శాంతంగా నిద్ర‌పోవాలా..అయితే ఈ టిప్స్ మీకే!

నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది ప్ర‌శాంత‌మైన నిద్ర‌ను పొంద‌లేక నానా తిప్ప‌లు ప‌డుతున్నారు.ప‌ని ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, స్మోకింగ్‌, మాన‌సిక ఆందోళ‌న‌, ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లు, లేనిపోని భ‌యాలు ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఈ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

 Good Sleep Sleeping Problems Latest News Sleeping-TeluguStop.com

దీనిని అలాగే వదిలేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది.అందుకే త‌గ్గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

మ‌రి ప్ర‌శాంతంగా నిద్ర ప‌ట్టాలంటే ఏం చేయాలి.? ఎలాంటి టిప్స్ పాటించాలి.? అన్న విష‌యాలు అల‌స్యం ఇప్పుడు తెలుసుకుందాం.

 Good Sleep Sleeping Problems Latest News Sleeping-ప్ర‌శాంతంగా నిద్ర‌పోవాలా..అయితే ఈ టిప్స్ మీకే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎంత ట్రై చేసినా ప్ర‌శాంతంగా నిద్ర ప‌ట్ట‌డం లేద‌ని బాధ ప‌డే వారు.

ప‌డుకోవ‌డానికి ముందు బెడ్‌పై కూర్చుని మైండ్‌లో నుంచి వేస్ట్ మెటీరియల్ అంటే పిచ్చి పిచ్చి ఆలోచ‌న‌లు, భ‌యాలు బ‌య‌ట‌కు తోసేసి దీర్ఘంగా శ్వాస తీసుకుని వ‌దిలేయాలి.ఇలా ప‌దిహేను నుంచి ఇర‌వై సార్లు చేసి.

ఆ త‌ర్వాత ప‌డుకుంటే ప్ర‌శాంతంగా నిద్ర ప‌డుతుంది.

అలాగే ఒత్తిడి నిద్ర‌ను పాడుచేయ‌డంలో ముందుంటుంది.

అందువ‌ల్ల, ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే.అంత ప్ర‌శాంతంగా నిద్ర‌పోవ‌చ్చు.

చాలా మందికి ప‌గ‌టి పూట నిద్ర పోయే అల‌వాటు ఉంటుంది.ఇలాంటి వారికి రాత్రి స‌రిగ్గా నిద్ర ప‌ట్ట‌దు.

కాబ‌ట్టి, ప‌గ‌టి నిద్ర‌కు దూరంగా ఉంటే.రాత్రి హాయిగా ప‌డుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

కొంద‌రు నిద్రించే ముందు టీ, కాఫీలు తాగుతుంటారు.కానీ.

టీ, కాఫీల్లో ఉండే కెఫిన్ నిద్ర‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది.అందుకే నిద్రిపోయే ముందు ఇటువంటి పానియాల‌కు దూరంగా ఉంటాలి.

అలాగే ప‌డుకునే ముందు సాంగ్స్‌ విన‌డం, మంచి బుక్స్ చ‌ద‌వ‌డం చేస్తే.మొద‌డు మ‌రియు మ‌న‌సు రెండూ ప్ర‌శాంతంగా మార‌తాయి.

దాంతో మంచి నిద్ర ప‌డుతుంది.ఇక హాయిగా నిద్రించాలంటే పడుకునే ప్రదేశం కూడా ఎంతో ముఖ్యం.

అందుకే మీకు సెట్ అయ్యే బెడ్‌ను ఎంచుకోవాలి.

#Good Health #Sleeping #Health #Good Sleep #Health Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు