బీర సాగుకు మేలు రకం విత్తన రకాలు.. మెరుగైన సస్యరక్షక పద్ధతులు..!

Good Seed Types For Ridge Gourd Cultivation Better Plant Protection Methods , Protection Methods, Ridge Gourd , Fake Seeds, Jagityala Lang, Tamil Nadu, Arma Sumit, Protection Methods, Ridge Gourd , Fake Seeds, Jagityala Lang, Tamil Nadu, Arma Sumit

బీర తీగ జాతి( ridge gourd ) కూరగాయ పంట.ఒక ఎకరంలో దాదాపుగా ఆరు టన్నుల పంట దిగుబడిను సాధించవచ్చు.

 Good Seed Types For Ridge Gourd Cultivation Better Plant Protection Methods , Pr-TeluguStop.com

అయితే మార్కెట్లో విపరీతంగా నకలి విత్తనాల దందా నడుస్తోంది.సరైన అవగాహన లేకుండా పొరపాటున నకిలీ విత్తనాలను( Fake seeds ) సాగు చేస్తే తీవ్ర నష్టం ఎదుర్కోవలసిందే.

కాబట్టి తాము చేసే సాగుకు సంబంధించిన విత్తనాలు మేలు రకానికి చెందినవో, కావో అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ప్రతి రైతుకు ఉంది.మనం ఇప్పుడు బీర సాగుకు మేలు రకం విత్తన రకాలు ఏంటో.

సాగులో కొన్ని ముఖ్యమైన మెళుకువలు ఏంటో తెలుసుకుందాం.

బీర సాగు చేయడానికి తేలికపాటి ఎర్ర గరప నేలలు, ఇంక మట్టి నేలలు, నీరు నిల్వ ఉండని ఒండ్రు నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.

నేల యొక్క పీహెచ్ విలువ ఆరు నుంచి ఏడు మధ్యన ఉండే నెలలలో అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.తేమతో కూడిన వేడి వాతావరణం ఈ పంట సాగుకు చాలా అనుకూలం.

వాతావరణంలో ఉష్ణోగ్రత 25 నుండి 30 సెంటీగ్రేడ్ ఉంటే బీరలో పూత, పిందె, కాయ పెరుగుదల బాగా ఉంటుంది.ఎటువంటి నేలలో సాగు చేసిన నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

బీర సాగుకు మేలు రకం విత్తనాలు:జగిత్యాల లాంగ్:( Jagityala Lang ) ఇది కరీంనగర్ జిల్లాకు చెందిన దేశవాళీ రకం.ఖరీఫ్ లో సాగు చేస్తే కాయ 50-60 సెంటీమీటర్లు పెరిగి అధిక దిగుబడి ఇస్తుంది.వేసవిలో అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేదు.

పి.క.యం-1: ( P.K.m-1 )ఈ రకం తమిళనాడుకు చెందినది.కాయలు 60-70 సెంటీమీటర్లు పెరిగి ఒక ఎకరంలో దాదాపు 7 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు.

Telugu Agriculture, Arma Sumit, Seeds, Jagityala Lang, Latest Telugu, Methods, R

అర్మ సుజాత: ( Arma Sujata )ఈ రకం బూజు తెగులను తట్టుకొని నిలబడగలుగుతుంది.కాయలు 50-55 సెంటీమీటర్లు పెరిగి ఒక ఎకరంలో దాదాపుగా 21 టన్నుల పంట దిగుబడి వస్తుంది.

కో-1: ఈ రకం తమిళనాడుకు( Tamil Nadu ) చెందినది.కాయలు 40-45 సెంటీమీటర్ల పొడవు పెరిగి ఎకరం పొలంలో దాదాపుగా 5.6 టన్నుల దిగుబడి వస్తుంది.

Telugu Agriculture, Arma Sumit, Seeds, Jagityala Lang, Latest Telugu, Methods, R

కో-2: ఈ రకం కూడా తమిళనాడుకు చెందినదే.కాయలు 90-100 సెంటీమీటర్ల పొడవు పెరిగి ఎకరం పొలంలో పది టన్నుల దిగుబడి పొందవచ్చు.

ఆర్మ సుమిత్:( Arma Sumit ) ఈ రకం బెంగుళూరుకు చెందినది.కాయల పొడవు 55 సెంటీమీటర్లు కాయల మందం 25 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది.

ఒక ఎకరం పొలంలో దాదాపుగా 21 టన్నుల దిగుబడి పొందవచ్చు.ఇలాంటి మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకొని సాగు చేస్తే అధిక దిగుబడి పొంది మంచి లాభాలు అర్జించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube