సోలో బ్రతుకే సో బెటర్‌ రిలీజ్‌ తర్వాత సంక్రాతి సినిమాల పరిస్థితి ఏంటీ?

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న థియేటర్లు ఓపెన్‌ అయ్యాయి.థియేటర్లు తెరచి నెల అవుతున్నా కూడా పెద్ద సినిమాలు లేకపోవడతో జనాలు అటు వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు.ఎట్టకేలకు మెగా హీరో సాయి తేజ్‌ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా విడుదల అయ్యింది.50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాను విడుదల చేసేందుకు ముందుకు వచ్చిన మొదటి పెద్ద నిర్మాతగా ఈ సినిమా నిర్మాతలు నిలిచారు.ఈ సినిమా కోసం ప్రతి ఒక్క సినీ ప్రముఖుడు స్పందించారు.ఈ సినిమాతో మళ్లీ థియేట్రికల్‌ ఎక్స్‌ పీరియన్స్‌ ను ఎంజాయ్‌ చేయండి అంటూ ట్వీట్స్ చేశారు.

 Good Response For Sai Dharam Tej Solo Bratuke So Better , Theaters Open‌, Solo-TeluguStop.com

సోషల్‌ మీడియాలో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్ల సినిమా కు జనాలు బాగానే వచ్చారు.మొదటి రోజు ఈ సినిమాకు నాలుగు కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ వచ్చింది.

కేవలం నైజాం ఏరియాలోనే కోటి కలెక్షన్స్‌ నమోదు అయ్యాయి అంటే ఎలా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Telugu Sankranthi, Telugu, Sai Dharam Tej, Sankranti, Solo Brathuke, Theaters-Mo

సినిమాలు విడుదల అయితే ఇంతకు ముందు స్థాయిలో కాకున్నా కనీసం 60 నుండి 70 శాతం మంది అయినా సినిమాను చూసేందుకు ముందుకు వస్తున్నారు.ఈ సినిమాతో ఆ విషయం నిరూపితం అయ్యింది.కాస్త మంచి కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కడతారు.

ఆ విషయంలో ఎలాంటి డౌట్‌ అక్కర్లేదు అంటూ మెగా మూవీ నిరూపించింది.కనుక సంక్రాంతికి సినిమాలు విడుదల అయితే ప్రేక్షకుల నుండి ఆధరణ బాగానే ఉంటుందని తేలిపోయింది.

కనుక ఇప్పటికే ఫిక్స్‌ అయిన క్రాక్‌ మరియు మాస్టర్‌ సినిమాలు పెద్ద ఎత్తున విడుదల అవ్వడం ఖాయంగా తెలుస్తోంది.వీటితో పాటు మరి కొన్ని సినిమాలు కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు వరుసగా ఫిబ్రవరి నుండి విడుదలకు సిద్దం అయ్యే అవకాశం ఉందంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube