వారసత్వ రాజకీయాలకు చరమ గీతం పాడాలి:కార్తీక్ బెనర్జీ

పశ్చిమ బెంగాల్ లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి.గత అసెంబ్లి ఎన్నికల్లో అనూహ్యంగ పుంజుకున్న బి‌జే‌పి పార్టీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తుంది.

 Good Politics Needed In Bengal Says Karthik Banerjee-TeluguStop.com

ఇప్పుడు అక్కడ తృణమూల్ కాంగ్రెస్, బి‌జే‌పి ల మధ్య పోరు రసవత్తరంగా ఉంది.రాష్ట్ర నాయకులు బి‌జే‌పి పెద్దలను రంగంలోకి దింపుతున్నారు.

Telugu Amith Shah, Karthik Benarji, Mamatha Benarji-Political

తాజాగా కేంద్రమంత్రి అమిత్ షా అక్కడ పర్యటించి పార్టీ శ్రేణుల్లో కొండంత ధైర్యంను నింపాడు.పశ్చిమ బెంగాల్ సి‌ఎం మమత బెనర్జీ సోదరుడు కార్తీక్ బెనర్జీ వారసత్వ రాజకీయాలకు చరమ గీతం పాడాలని అన్నాడు.ప్రజల స్థితిగతులు మారాలని పేర్కొన్నాడు.కుటుంబ ప్రయోజనలకోసం పనిచేసే రాజకీయనాయకుల పట్ల ప్రజలు విసిగిపోయారని అన్నాడు.మమతా బెనర్జీ వారసత్వ రాజకీయాల గురించి మీరు మాట్లాడుతున్నారా అని ప్రశ్నించగ, రాజకీయాల్లో జరిగే వంచన గురించి నేను మాట్లాడుతున్న అన్నాడు.

ముందు ప్రజల గురించి ఆ తర్వాత కుటుంబం గురించి ఆలోచించాలి అన్నాడు.

మన పురాణాల్లో ఋషులు మనకు ఏ విదంగా ప్రజలను పరిపాలన చెయ్యాలని చూపించారో ఆ దారిలో మన రాజకీయాలు ఉండాలని అన్నాడు.ఈ నేపథ్యంలో కార్తీక్ బెనర్జీ త్వరలో బి‌జే‌పి పార్టీ లో చేరుతాడు అనే వార్తలు వస్తున్నాయి అందుకే మమతా బెనర్జీపై వారసత్వ రాజకీయ విమర్శలు చేశాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కానీ ఆయన బి‌జే‌పి లో చేరిక పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube