ప్రయాణికులకు శుభవార్త.. రోడ్డెక్కిన బస్సులు

లాక్‌డౌన్‌తో మార్చి నుంచి ఏపీ-తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.ప్రైవేట్ యాజమాన్యాలు భారీగా ఛార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికుల జేబుకు చిల్లులు పడ్డాయి.

 Good News To Rtc Passengeres, Apsrtc, Tsrtc, Buses, Running-TeluguStop.com

ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో భారీ ఛార్జీలు చెల్లించి ప్రైవేట్ బస్సుల్లో  ప్రజలు ప్రయాణించారు.అయితే ఎట్టకేలకు చాలా నెలల తర్వాత ప్రయాణికులకు ఊరట కలిగింది.

ఏపీ-తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి.నేటి నుంచి ఆన్‌లైన్ రిజర్వేషన్లను కూడా ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇప్పటికే విజయవాడ-హైదరాబాద్ మధ్య ఆన్ లైన్ రిజర్వేషన్ల సదుపాయాన్ని ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల అంతరాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతో ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి.

అంతరాష్ట్ర బస్సుల ఒప్పందంపై చర్చించేందుకు పలుమార్లు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ లో భేటీ అయ్యారు.అనేకసార్లు చర్చించిన తర్వాత ఎట్టకేలకు ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరడంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సులు ప్రారంభమయ్యాయి.

ఏపీలో తెలంగాణ ఎన్ని కిలోమీటర్లు బస్సులు నడుపుతుందో.ఏపీ కూడా తెలంగాణలో అన్ని కిలోమీటర్లు మాత్రమే బస్సులు తిప్పాలి.

దీని వల్ల ఏపీ ఆర్టీసీకి ఎక్కువ నష్టం జరుగుతుందని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.కాగా లాక్‌డౌన్‌లో బస్సులు నిలిచిపోవడం వల్ల ఇరు రాష్ట్రాల ఆర్టీసీకి తీవ్ర నష్టం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube