అరవింద సమేత గురించి షాకింగ్‌ న్యూస్‌.. ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీ       2018-06-17   00:12:44  IST  Raghu V

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఫుల్‌ స్వింగ్‌లో ‘అరవింద సమేత’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్‌ గత చిత్రం ‘జైలవకుశ’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అజ్ఞాతవాసితో నిరాశ పర్చినా కూడా దర్శకుడు త్రివిక్రమ్‌ తప్పకుండా ఈ చిత్రంతో ఆకట్టుకుటాడు అనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్‌లుక్‌ రివీల్‌ అయిన విషయం తెల్సిందే. ఫస్ట్‌లుక్‌లోనే సిక్స్‌ ప్యాక్‌ను చూపించిన ఎన్టీఆర్‌ సినిమాలో తన నట విశ్వరూపం చూపిస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మూవీ కోసం దాదాపు అయిదు సంవత్సరాలుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు దసరాతో ఫుల్‌ స్టాప్‌ పడబోతుంది. ఇన్నాళ్ల ఎదురు చూపులకు తగ్గట్లుగా సినిమా ఉండాలనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్‌ చాలా ప్రత్యేకంగా స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడు. ఎన్టీఆర్‌ తనపై పెట్టుకున్న నమ్మకంను నిలుపుకునేలా దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. తప్పకుండా ఈ చిత్రం ఒక బిగ్గెస్ట్‌ చిత్రంగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం సినీ వర్గాల్లో తెగ చర్చకు తెర లేపుతుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ డబుల్‌ రోల్‌ చేసిన సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా జై లవకుశ చిత్రంలో ట్రిపుల్‌ రోల్‌ చేసి ఆకట్టుకున్నాయి. అలాగే ఈ చిత్రంలో కూడా తప్పకుండా ఎన్టీఆర్‌ డబుల్‌ రోల్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తాడు అంటూ సినీ వర్గాల వారు నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ చిత్రంలో ఇద్దరు ఎన్టీఆర్‌లలో ఒక ఎన్టీఆర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాగా, మరో ఎన్టీఆర్‌ ఫ్యాక్షన్‌ లీడర్‌ అంటూ సమాచారం అందుతుంది.

ఇద్దరు అన్నదమ్ముళ్లే అయినా కూడా చిన్నప్పుడే విడిపోవడం, ఒకరికి తెలియకుండా ఒకరు పెరగడం జరుగుతుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన వ్యక్తి ఫ్యాక్షన్‌ గొడవల్లోకి, ఫ్యాక్షన్‌ లీడర్‌ అయిన వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలోకి ఎంట్రీ ఇస్తారు. అలా జరిగే సరదా స్క్రీన్‌ప్లేను దర్శకుడు త్రివిక్రమ్‌ ఎలా చిత్రీకరిస్తున్నాడు అనేది ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుంది. ఫ్యాక్షన్‌ లీడర్‌ అయిన ఎన్టీఆర్‌కు జోడీగా ఈషా రెబ్బా అలరించబోతుంది. మొత్తానికి ఎన్టీఆర్‌ డబుల్‌ ఫోజ్‌ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందేమో చూడాలి.