ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌... ఎంసెట్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది.ఇంటర్ పూర్తి అయిన తర్వాత ఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 Telangana Government Cancel 45-percentage Marks Rule In Intermediate  Telangana,-TeluguStop.com

ఎంసెట్‌కు సంబంధించిన పలు నిబంధనలను తొలగించింది.ఇప్పటివరకు ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఇస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఇక నుంచి ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ ఉండదు.ఈ మేరకు ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ నిబంధనను తొలగిస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ నిబంధన ఎత్తివేయడంతో ఇంటర్ పాసైన వాళ్లందరూ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం దక్కినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇప్పటివరకు ఎంసెట్ పరీక్ష రాయాలంటే ఇంటర్‌లో కనీసం 45% మార్కులు వచ్చి ఉండాలనే నిబంధన అమల్లో ఉంది.

ఫెయిలైన వారు సప్లిమెంటరీ రాసి ఎంసెట్‌కు అర్హత సాధించే అవకాశం ఉండేది.అయితే కరోనాతో సప్లిమెంటరీ లేకుండా 35 మార్కులతో అందరినీ పాస్ చేయడంతో చాలా మంది ఎంసెట్‌కు దూరమయ్యారు.

ఈ క్రమంలో ఆ నిబంధన ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇంటర్ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ నిబంధన ఎత్తివేయాలని హైకోర్టులో కొంతమంది పిటిషన్లు కూడా దాఖలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube