సిటీ బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త  

good news to bus pass holders, buspass, hyderabd, lockdown, tsrtc - Telugu Buspass, Counters, Holders, Lockdown, Officials, Tsrtc

లాక్‌డౌన్, కరోనా ప్రభావం వల్ల మార్చిలో హైదరాబాద్‌లో ఆగిపోయిన సిటీ బస్సులు గత నెల నుంచి తిరుగుతున్న విషయం తెులిసిందే.అయితే కరోనా ప్రభావం క్రమంలో సిటీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రజలు ఎవరూ ఆసక్తి చూపడం లేదు.

TeluguStop.com - Good News To Bus Pass Holders

దీంతో సిటీ బస్సుల్లో రద్దీ అంతగా కనిపించడం లేదు.కరోనా ప్రభావం క్రమంలో క్యాబ్స్‌లలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
ఈ క్రమంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలిపింది.లాక్‌డౌన్ కాలంలో బస్సు పాస్‌లు ఉన్నవారికి ఆర్టీసీ అధికారులు తాజాగా గుడ్ న్యూస్ తెలిపారు.లాక్‌డౌన్ కాలంలో వినియోగించుకోలేని బస్ పాసులు తిరిగి ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
లాక్ డౌన్ కాలంలో బస్ పాస్ ను వినియోగించుకోని ప్రయాణికుకలు నవంబర్ 30 లోపు పాత ID కార్డు, టికెట్‌ను బస్ పాస్ కౌంటర్లలో సమర్పించి కొత్త పాస్ తీసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య బస్సులు లేక పాసులు వినియోగించుకోలేని వారు ఇప్పుడు కొత్త పాస్ తీసుకోవచ్చన్నారు.నగరంలో దాదాపు 20 లక్షల పాసులు ఉన్నట్లు చెప్పారు.

TeluguStop.com - సిటీ బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త-General-Telugu-Telugu Tollywood Photo Image


లాక్‌డౌన్ కాలంలో సిటీ బస్సులో ఆగిపోవడంతో అంతకుముందు బస్ పాస్ తీసుకున్నవారు దానిని ఉపయోగించుకోలేకపోయారు.దీంతో బస్ పాస్ తీసుకున్నవారు అధికారులకు తమ సమస్యలను తెలిపారు.

ఈ క్రమంలో వారికి ఊరట కలిగిస్తూ తాజాగా ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

#Officials #TSRTC #Lockdown #Buspass #Counters

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Good News To Bus Pass Holders Related Telugu News,Photos/Pics,Images..