గుడ్ న్యూస్: రైలులో జనరల్ టికెట్ ధరకే ఏసీ ప్రయాణం..!?

భారతీయ రైల్వే శాఖ మరొక సంచలన నిర్ణయం తీసుకోనుంది.ఇకమీదట రైలులో ఉండే జనరల్ బోగీలను ఏసీ కోచ్‌లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

 Good News, Railway, Ticket Rate, Ac Coach, Latest News, Ticket Price Decrease-TeluguStop.com

అంటే దూర ప్రాంతాలకు రైలులో ప్రయాణం చేసే బోగీలన్నీ ఏసీ కోచ్‌లుగా మారనున్నాయి.ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణాన్ని అందించడం కోసం రైల్వే ఈ మార్పులు చేయబోతోంది అని తెలుస్తుంది.

మన దేశ వ్యాప్తంగా ప్రతి రోజు రైలులో ప్రయాణం చేసే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంటుంది.దూర ప్రాంతాలకు వెళ్లే వారు తప్పనిసరిగా రైలు మార్గాన్నే ఎంచుకుంటారు.

ఈ క్రమంలోనే దూర ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం ఏసీ జనరల్ క్లాస్ కోచ్‌ల పేరుతో కొత్త బోగీలను పరిచయం చేయనుంది మన రైల్వే శాఖ.అలాగే ఈ రైళ్లల్లో జనరల్ బోగీలతో పాటు స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ బోగీలు కూడా ఉండనున్నాయి.త్వరలో దూర ప్రాంతాల రైళ్లల్లో బోగీలన్నీ ఏసీవే ఉంటాయి.

ఏసీ జనరల్ క్లాస్ కోచ్‌ లో 100 నుంచి 200 మంది ప్రయాణికులు కూర్చుని ప్రయాణం చేయవచ్చు.

అయితే టికెట్ ధర విషయానికి వస్తే.జనరల్ టికెట్ ధరలతో సమానంగా ఉంటాయి.

లేదంటే కాస్త ఎక్కువగా కూడా ఉంటాయి.తక్కువ ధర టికెట్‌తో ఏసీ ప్రయాణానికి ఈ కోచ్‌లు ఉపయోగపడతాయి.

కాగా పంజాబ్‌ లోని కపుర్తలాలో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ ఏసీ జనరల్ క్లాస్ కోచ్‌లు తయారు చేయడం జరుగుతుంది.ఈ కొత్త ఏసీ బోగీల్లో సీట్లన్నీ రిజర్వ్డ్ సీట్లే ఉంటాయి.

అలాగే ఆటోమెటిక్‌గా తెరుచుకునే, మూసుకునే డోర్స్ ను అమర్చనున్నారు.నిజానికి జనరల్ కోచ్‌ లోని సీట్లన్నీ అన్‌రిజర్వ్‌డ్‌ గా ఉంటాయి.

Telugu Ac Coach, Latest, Railway, Ticket-Latest News - Telugu

కానీ కరోనా వైరస్ తర్వాత ఈ సీట్లను రిజర్వ్‌డ్ కోచ్‌ లుగా మార్చారు.నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ప్రయాగ్‌రాజ్-జైపూర్ రైలులో ఇలాంటి ఏసీ ఎకనమీ కోచ్‌లు ఏర్పాటు చేసింది రైల్వే శాఖ.ఎకనమీ క్లాస్ ఏసీ కోచ్‌ల టికెట్ ధరలు థర్డ్ ఏసీ టికెట్ కన్నా 8% తక్కువగా ఉంటాయి.కోవిడ్ కారణంగా కొన్ని రైళ్లు నిలుపుదల చేయడం జరిగింది కానీ ఇప్పుడు రైల్వే శాఖ తన సేవల్ని పునరుద్ధరించే క్రమంలో మరికొన్ని రోజుల్లో 1700 రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

అలాగే కోవిడ్ స్పెషల్ రైళ్లు కూడా ఇకమీదట ఉండని కారణం చేత రానున్న రోజుల్లో రైల్వే టికెట్ ధరలు కూడా తగ్గనున్నాయి అని తెలుస్తుంది.ఇది రైలు ప్రయాణికులకు శుభవార్త కలిగించే విషయం అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube