రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. నిబంధనలలో సడలింపులు..!

తాజాగా ఇండియన్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త తెలియజేసింది.కరోనా వైరస్ నేపథ్యంలో రైలు ఎక్కేందెకు కనీసం గంట కంటే ముందు స్టేషన్ కు రావాలని ఉన్న నిబంధనలను తాజాగా సడలించింది.

 Indian Railways Lockdown Eases For Passengers, Automatic Thermal Screening, Coro-TeluguStop.com

ఇందుకు సంబంధించి ఇది వరకు ప్రతి ఒక్కరిని పరీక్షించడంలో భాగంగా స్టేషన్ లోకి రావడం వారిని పరీక్షించాలి అంటే ఆలస్యమైందని అందుకే ప్రయాణికులను గంట నుంచి గంటన్నర సమయం ముందే రావాలని ప్రయాణికులకు రూల్స్ విధించింది.ఇకపోతే తాజాగా ఈ పనిని కంప్యూటరీకరణ చేయడంతో ఇప్పుడు పూర్తిగా లేజర్ టెక్నాలజీ సహాయంతో థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు చేసినందుకుగాను ప్రయాణికులు రైల్వే స్టేషన్ లోకి అడుగుపెడుతూనే వారి శరీర ఉష్ణోగ్రతను ఆటోమేటిక్ గా అంచనా వేస్తుంది అని అధికారులు తెలియజేశారు.

ఇకపోతే ఇందుకు సంబంధించి తాజాగా ప్రయాణికులు ఇదివరకు లాగే కేవలం అరగంట ముందు సమయానికి రైల్వే స్టేషన్ కు వస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు.అయితే ఖచ్చితంగా కేవలం ప్రయాణించే ప్రయాణికులుకు మాత్రమే అనుమతి ఇస్తారని మిగతా వారికి ఎటువంటి అనుమతి ఉండదని అధికారులు తేల్చి చెప్పారు.

ఎవరికైనా ప్రయాణ సామాగ్రి ఎక్కువగా ఉన్న వారు ముందుగా రైల్వే స్టేషన్ కు చేరుకుని అక్కడ ఉన్న రైల్వే కూలీలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

అలాగే వీలైనంత వరకు ప్రయాణికులు ఆహారం బయట కొనకుండ వారి ఇంటి నుంచి తీసుకు వస్తే చాలా మేలని తెలిపారు.

రైల్వే స్టేషన్ లోని రెస్టారెంట్లు, క్యాంటీన్లు తినేందుకు ఎలాంటి అనుమతి లేదు కాబట్టి.వీలైనంత వరకు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిందిగా అధికారులు తెలుపుతున్నారు.

కరోనా వైరస్ కారణంగా ఏసీ ప్రయాణికులకు అందించే బెడ్ షీట్ లో సరఫరా సైతం నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.రైలులో ప్రయాణం చేయాల్సిన వారు ఖచ్చితంగా బౌతిక దూరం పాటిస్తూ మొహానికి మాస్క్ ధరించాలని అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube