గుడ్ న్యూస్...వలస వాసులుకు 3ఏళ్ళకే శాశ్వత హోదా....కీలక ప్రకటన చేసిన...

ప్రస్తుతం అన్ని రంగాలలో పోటీ ఉంది.విద్య, వ్యాపారం, క్రీడా రంగం ఇలా ప్రతీ ఒక్క రంగంలో పోటీ విపరీతంగా ఎర్పడింది.

 Good News Permanent Status For Migrants In 3 Years Key Announcement Made ,  Per-TeluguStop.com

గతంలోలా వానాకాలం చదువులు చదివితే స్థిరపడిపోయే రోజులు పోయాయి.తాడిని తన్నే వాడు ఉంటే దాని తలను తన్నే వాడు ఉన్నట్టుగా ఉంది ప్రస్తుత జీవిత విధానం.

అయితే ఈ పోటీ తత్వం రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య కూడా ఉంటుంది.ఆ దేశం అభివృద్ధి చెందుతోందంటే ఎలాంటి విధానాలను అనుసరిస్తోందో బేరీజు వేసుకుని వాటిని అనుసరిస్తూ వృద్ది చెందుతున్న దేశాలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం.

అమెరికా గడిచిన దశాబ్దాలుగా అనుసరిస్తున్న వలస విధానాన్ని ఇప్పుడు మిగిలిన దేశాలు అనుసరిస్తున్నాయి.

అయితే కాస్త ఆ విధానంలో మార్పులు చేర్పులు చేస్తూ ఆయా దేశాలు ప్రవాసులను ఆకర్షించే పనిలో పడ్డాయి.అమెరికా అభివృద్ధిలో సగానికిపైగా కారణం వలస వాసుల కృషేనని జగమెరిగిన సత్యమే.

ఇప్పుడు ఇదే బాటలో కెనడా, ఆస్ట్రేలియా పయనిస్తుండగా తాజాగా జర్మనీ కూడా ప్రవాసులను ఆకర్షించే పనిలో పడింది.అయితే నిన్నటి వరకూ కెనడా ఇచ్చిన ఆఫర్ కు నోళ్ళు వెళ్ళ బెట్టి అమెరికా కాదనుకుని కెనడా వెళ్ళిన ప్రవాస విద్యార్ధులు తాజాగా జర్మనీ ప్రకటించిన భంపర్ ఆఫర్ తో షాక్ లో ఉన్నారు.

Telugu America, Canda, Expatriate, Germany, Labor, Status-Telugu NRI

అమెరికాలో శాశ్వత పౌరసత్వం రావడం అంటే మామూలు విషయం కాదు ఏళ్ళ తరబడి వేచి చూస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.దాంతో కెనడా తమ దేశంలోకి వలసలు వచ్చే విద్యార్ధులు, నిపుణులకు శాశ్వత పౌరసత్వాన్ని కేవలం ఐదేళ్ళకే ఇచ్చేస్తామని ప్రకటించడంతో ఎంతో మంది వలస వాసులు కెనడా కు క్యూ కట్టారు.ఇప్పుడు తాజాగా జర్మనీ కెనడా కంటే భంపర్ ఆఫర్ ఇచ్చింది.తమ దేశంలో ఉండే ప్రవాసులకు కేవలం 3 ఏళ్ళకే శాశ్వత హోదా కల్పిస్తామని కీలక ప్రకటన చేసింది.తమ దేశాభివృద్ధి తో పాటు దేశంలో నెలకొన్న కార్మిక సమస్యలను అధిగమించేక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా జర్మనీ ప్రకటించింది.2026 నాటికి జర్మనీలో సుమారు 8 కోట్ల మంది కార్మికుల కొరత ఎర్పడనుందట అందుకే ఉప్పటి నుంచే ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోందని అంటున్నారు పరిశీలకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube