శుభవార్త చెప్పిన నోయల్.. జీవితంలో కొత్త ఆరంభం!

తెలుగు సిని నటుడు నోయల్ పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే.నటుడి గానే కాకుండా సంగీత నిర్మాతగా, టీవీ యాంకర్, రేడియో జాకీ గా ఇలా పలు గుర్తింపులతో మంచి పేరు సంపాదించుకున్నాడు.

 Good News Is That Noel Is A New Beginning In Life-TeluguStop.com

అంతేకాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాల్గొని హౌస్ లో ఉన్నంత కాలం మంచి వ్యక్తిత్వంతో అభిమానులను సొంతం చేసుకున్నాడు.ఇదిలా ఉంటే అభిమానులకు ఓ శుభవార్త చెప్పాడు నోయల్.

ఇటీవలే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఓ ఎగ్జైటింగ్ న్యూస్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.ఈ విషయం చెప్పాలని ఎంతో ఆసక్తిగా ఉంది.ఆగలేక పోతున్నాను అంటూ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ కు నెటిజనులంతా నోయల్ మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడా అని కామెంట్స్ బాగా ఎదురయ్యాయి.

 Good News Is That Noel Is A New Beginning In Life-శుభవార్త చెప్పిన నోయల్.. జీవితంలో కొత్త ఆరంభం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక మరికొందరు సినిమాకు సంబంధించిన న్యూస్ అని అనుకున్నారు.మొత్తానికి తాజాగా ఆ శుభవార్త ఏంటో బయటికి చెప్పాడు.

Telugu Begin New Life, Bigg Boss, Good News, Noel, Pujitha Ponnada-Movie

తన జీవితంలో కొత్త ఆరంభం ఉందని తెలిపాడు.తను హీరో గా రాబోతున్న ఓ కొత్త సినిమా గురించి అప్ డేట్ ఇచ్చాడు.నిజానికి తనకు హీరో కావాలని పలుమార్లు తెలిపాడు.ఇక మొత్తానికి ఆయన సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు.వినోద్ నాగుల దర్శకత్వంలో ‘మనిషి’ అనే సినిమాతో నోయల్ సోలో హీరోగా పరిచయం కానున్నాడు.ఇందులో పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాకు సత్యనారాయణ నాగుల నిర్మాతగా చేస్తున్నాడు.

ఈ సినిమాను జూన్ 18న స్పార్క్ ఓటీటీ లో విడుదల చేయడానికి సినీ బృందం ప్రకటించారు.మొత్తానికి నోయల్ కోరిక తీరనుండగా ఈ సినిమా తనకు కెరీర్ కు ఎటువంటి సక్సెస్ ను అందిస్తుందో ఎదురు చూడాలి.

#Noel #Bigg Boss #Pujitha Ponnada #Begin New Life

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు