గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్.. అందుబాటులోకి రానున్న ఆ వెర్షన్..!

టెక్నాలజీ రోజు రోజుకూ నూతన పుంతలు తొక్కుతోంది.దాని దిశను మార్చుకుంటూ నూతన విధానాలపై అడుగులు వేస్తోంది.

 Good News, Google, New Version, Android 12, New Update, New Features, Technology-TeluguStop.com

ఇప్పుడు నడుస్తున్న స్మార్ట్ ఫోన్ల యుగం.చాలామంది తమకు నచ్చిన స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలని అనుకుంటారు.అయితే ఎక్కువ మంది ఆండ్రాయిడ్ ఫోన్లనే వినియోగిస్తుంటారు.అటువంటి వారికి గూగుల్ శుభవార్త చెప్పింది.ఆండ్రాయిడ్‌ 12 అప్‌డేట్‌ పై గూగుల్‌ కంపెనీ కీలక విషయం తెలియజేసింది.నవంబర్‌ నెల రెండో వారంలోపు తాాజాగా ఉండే వర్షన్‌ ను వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నట్లు గూగుల్ తెలిపింది.

అయితే ఆ సమయంలో వరకూ ఆండ్రాయిడ్‌ అప్డేట్‌ కు సంబంధించి కోడ్‌ ను ఓపెన్‌ సోర్స్‌ ప్రాజెక్ట్‌ లో గూగుల్ అప్లోడ్‌ చేయడం విశేషంగా చెప్పొచ్చు.ఇంకో కొన్ని వారాల్లోనే గూగుల్ పిక్సెల్ ఫోన్లతోనే లేటెస్ట్‌ ఆండ్రాయిడ్‌ అప్డేట్‌ ను గూగుల్‌ అందించనుంది.

ఆ తర్వాత శామ్‌సంగ్‌, వన్‌ ప్లస్‌, ఒప్పో, రియల్‌మీ, టెన్కో, వివో, షియోమీ డివైజ్‌ లకు కూడా దానిని ఇవ్వనునట్లుగా తెలుస్తోంది.పూర్తిగా ఆండ్రాయిడ్‌ ఫోన్లకు 12-వర్షన్‌ ను ఈ సంవత్సరం ఆఖరిలోపుగా ఇచ్చే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.

Telugu Android, Google, Ups-Latest News - Telugu

ఈపాటికే ఆండ్రాయిడ్‌ 12 బేటా వర్షన్‌ ద్వారా పిక్సెల్‌ డివైస్‌లతోనే గూగుల్ ఫీడ్‌ బ్యాక్‌ ను తీసుకుంది.ఆండ్రాయిడ్‌ 12 సోర్స్‌ ను ఆండ్రాయిడ్‌ ఓపెన్‌ సోర్స్‌ ప్రాజెక్టులోనే పెట్టింది.ఫ్రెండ్లీ ఫీచర్స్‌ తో పాటు ప్రైవసీ డ్యాష్‌ బోర్డ్‌, డైనమిక్‌ బిల్ట్‌ లాక్‌ స్క్రీన్, డైనమిక్‌ స్క్రీన్ లైటింగ్‌తో పాటు కెమెరా ఎఫెక్ట్స్‌, ఫొటోల ఎడిటింగ్‌ ఎఫెక్ట్ అనుభవాలను, అనుభూతులను ఈ కొత్త వెర్షన్‌ అందించనుంది.ఇక ఆండ్రాయిడ్‌ 12 వర్షన్‌ ని చూస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలను అక్టోబర్‌ 27, 28వ తేదీల్లో తెలియజేయనుంది.ఆ రోజులో జరిగే ఆండ్రాయిడ్‌ డేవ్‌ సమ్మిట్‌లో అనేక విషయాలను తెలియజేయనున్నారు.2010 నుంచి ఆండ్రాయిడ్‌లో ఒక్కో వెర్షన్‌ను గూగుల్ కంపెనీ రిలీజ్‌ చేస్తూ వస్తోంది.ఇప్పుడు ఆండ్రాయిడ్‌ లో 11 వర్షన్‌ని, ఐఫోన్లలో ఐవోఎస్‌ 15 వర్షన్‌లు నడుపుతోంది.మొత్తానికి గూగుల్ తమ యూజర్లకు ఓ కొత్త కానుకను అందించేందుకు సిద్దమైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube