గుడ్ న్యూస్: భారీగా తగ్గిన బంగారం ధరలు..!

బంగారం కొనాలి అనే ఆలోచనలో ఉండే మహిళలకు ఇది ఒక మంచి శుభవార్త అనే చెప్పవచ్చు.బంగారం కొనాలని ప్రతి మహిళ ఎంతో ఆశపడుతుంటారు.

 Gold Prices Reduced In India, Gold Price,gold Price In India, Gold Rates Decreas-TeluguStop.com

అయితే వారి కోరికలు తీరకుండా బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.దీంతో సామాన్య ప్రజల కు బంగారం కొనాలంటే ఎంతో కష్టతరమవుతుంది.

ఇలాంటి పరిస్థితులలో బంగారం కొనాలనే ఆలోచనలను కూడా విరమించుకున్నారు.

అలా బంగారం కొనాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు.

గత నాలుగు రోజుల నుంచి బంగారు ధరలు అమాంతం పెరిగి ధరలు ఆకాశాన్ని తాకాయి.అయితే ఇవాళ బంగారం ధరలు భారీగా పడిపోయాయి.కరోనా సమయంలో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 60 వేల వరకు పలికింది.ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపు ప్రక్రియ మొదలైన తర్వాత తిరిగి మార్కెట్ పుంజుకోవడం తో బంగారం ధరలు దిగివస్తున్నాయి.

తాజాగా నేడు జాతీయంగా నే కాకుండా, అంతర్జాతీయంగా బంగారు ధరలు కొంతవరకూ క్షీణించడం తో దాని ప్రభావం దేశీయ మార్కెట్లో పై పడి బంగారం ధరలు తగ్గాయి.కాగా ఈ రోజు బంగారం ధరలు భారీగా పతనమయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 200 రూపాయలు తగ్గి రూ.45,900 చేరుకుంది.అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.220 తగ్గి  50,070 రూపాయలకి చేరుకుంది.

ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గితే వెండి ధర మాత్రం అమాంతం పెరిగిపోయింది.మార్కెట్లో వెండి ధర రూ.200 పెరగడంతో కిలో రూ.67,500 లకు చేరుకుంది.ఒక్కసారిగా బంగారం ధరలు ఇలా పతనం కావడంతో భారీ ఎత్తున మహిళ లు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.అయితే ఇది మహిళలకు శుభవార్త అనే చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube