"యూట్యూబ్ మ్యూజిక్" యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై అవన్నీ ఉచితమే..!

ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లు వినియోగించే అప్లికేషన్లలో ఎక్కువగా గూగుల్‌కు సంబంధించినవే ఉంటాయి.క్రోమ్, జీమెయిల్, గూగుల్ మీట్, యూట్యూబ్ యూట్యూబ్ కిడ్స్, యూట్యూబ్ మ్యూజిక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అప్లికేషన్లు గూగుల్ ఆధీనంలోనే నడుస్తున్నాయి.

 Good News For youtube Music Users .. Everything Is Free Now .. You Tube Music, L-TeluguStop.com

అయితే బాగా ప్రాచుర్యం పొందిన గూగుల్ యాప్స్‌లో యూట్యూబ్ ఒకటని చెప్పవచ్చు.యూజర్లకు మరింత చేరువయ్యేందుకు గూగుల్యూట్యూబ్ మ్యూజిక్ను కూడా తీసుకొచ్చింది.

ఇందులో ప్రత్యేకంగా పాటలు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఉంటాయి.సంగీత ప్రియులకు ఇది ఒక ఉత్తమమైన యాప్ అని చెప్పుకోవచ్చు.

అయితే ఇందులో కొంతమేర డబ్బులు చెల్లిస్తేనే పూర్తిస్థాయిలో సేవలను ఆస్వాదించడానికి వీలవుతుంది.ముఖ్యంగా యూజర్లు వీడియో చూడకుండా పాటలు వినాలి అనుకుంటారు.

కానీ యూట్యూబ్ మ్యూజిక్ లో ఇలా బ్యాక్‌గ్రౌండ్ లో సాంగ్స్ వినాలి అంటే నెలవారీ చందా లేదా వార్షిక చందా చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఇప్పటివరకు సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ఇకపై అందరికీ అందుబాటులోకి రానుంది.

నవంబర్ 3 నుంచి ఎలాంటి రుసుము చెల్లించకుండా వినియోగదారులందరూ ఉచితంగా బ్యాక్‌గ్రౌండ్ లోనూ సంగీతాన్ని వినొచ్చని తాజాగా గూగుల్ ప్రకటించింది.అలాగే రేడియో స్టేషన్లను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చని తెలిపింది.

నిజానికి ఒక పాట ప్లే అవుతున్న సమయంలో వీడియో కూడా వస్తే అధిక డేటా అయిపోవడంతో పాటు ఛార్జింగ్ కూడా త్వరగా తగ్గిపోతుంది.దీనివల్ల చాలామంది యూట్యూబ్ మ్యూజిక్ యాప్ సరిగ్గా వాడలేక పోతున్నారు.

అందుకే గూగుల్ బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్‌ను ఫ్రీగా అందిస్తున్నట్లు తెలిపింది.ఇది యూట్యూబ్ మ్యూజిక్ యూజర్లకు గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు.

Telugu Latest, Tube Music, Youtube-Latest News - Telugu

యూట్యూబ్ మ్యూజిక్ లో ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు.ఇష్టమైన పాటలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.మీరు అప్‌లోడ్ చేసిన వీడియోలను ఎప్పుడైనా ప్లే చేయవచ్చు.కాకపోతే మ్యూజిక్ వినేటప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి.ఇలా రాకుండా ఉండాలంటే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube