మహిళలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లో ఆడవారి కోసమే సరికొత్త ఫీచర్!

భారత దేశంలో కోట్లాది మంది యూజర్లు వాట్సాప్ వినియోగిస్తున్నారు.దీంతో వాట్సాప్ ద్వారా యూజర్లకు చేరువ కావడం పలు కంపెనీలకు సింపుల్‌గా మారింది.

 Good News For Women Whatsapp Has A New Feature For Women,good News, Women's, Wha-TeluguStop.com

ఇప్పటికే చాలా కంపెనీలు తమ సేవలను వాట్సాప్‌లో లాంచ్ చేశాయి.అయితే తాజాగా మహిళల కోసమే ఏర్పాటైన సిరోనా హైజీన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వాట్సాప్ తో ఏకమై ఓ సరికొత్త ఫీచర్ లాంచ్ చేసింది.

ఈ ఫీచర్ కేవలం ఆడవారి కోసమే తీసుకొచ్చింది.నెలసరి సమయం, గర్భం దాల్చేందుకు సరైన సమయం, అండం ఏర్పడే తేదీ గురించి ఈ ఫీచర్ ఆడవారికి కచ్చితంగా చెబుతుంది.

అయితే ఆడవారు ఈ సేవలను ఆస్వాదించాలంటే మొదటగా తమ కాంటాక్ట్స్‌లో +919718866644 అనే నంబర్ సేవ్ చేసుకోవాలి.అనంతరం ఈ నంబర్‌కు హాయ్‌ (Hi) అని మెసేజ్‌ చేయాలి.

అప్పుడు ఒక చాట్ అసిస్టెంట్ మీకు అందుబాటులోకి వస్తుంది.రెండు ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి.

అందులో మీరు “ట్రాక్ మై పీరియడ్” అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ట్రాక్ పీరియడ్, ట్రయింగ్ టు కన్సీవ్, అవాయిడ్ ప్రెగ్నెన్సీ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.అందులో మీకు కావాల్సింది ఎంపిక చేసుకోవచ్చు.

Telugu Latest, Ups, Whatsapp, Womens-Latest News - Telugu

గర్భం దాల్చాలని అనుకుంటున్న వారు ఏ సమయం సరైనదో తెలుసుకోవాలంటే వారు ట్రయింగ్ టు కన్సీవ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.ఆ తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అందించాలి.నెలసరి ఎప్పుడు వస్తుందనేది ఈజీగా ట్రాక్ చేయడానికి కూడా ఈ సేవ చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది.అంతేకాదు, యూజర్‌ ముందుగానే తమ నెలసరి తేదీకి సంబంధించి రిమైండర్‌ను సెట్ చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube