ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల పాలిట, నిరుద్యోగుల పాలిట వరం.. ఇక ఆఫీస్‌ ల చుట్టు తిరగనక్కర్లేదు

స్కూల్స్‌, కాలేజీలు ప్రారంభం అవుతున్నాయంటే విద్యార్థులు క్యాస్ట్‌, ఇన్‌కం కోసం ఎంఆర్‌ఓ ఆఫీస్‌ల చుట్టు తిరగాల్సిన పరిస్థితి.స్కాలర్‌ షిప్‌ల కోసం తప్పనిసరిగా క్యాస్ట్‌ ఇన్‌కం కావాల్సిందే.

 Good News For Who Has Taking Ap Income Certificates For Yearly-TeluguStop.com

ఇక ప్రతి సంవత్సరం కొత్త ఆదాయ దృవీకరణ పత్రాలను విద్యార్థులు తీసుకోవాల్సిందే.కేవలం విద్యార్థులు మాత్రమే కాకుండా రకరకాల కారణాల కోసం కుల, ఆదాయ, లోకల్‌ ఏరియా సర్టిఫికెట్లు కావాల్సి ఉంటుంది.

ఈ సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు కనీసం వారం రోజులు అయినా కేటాయించాల్సి ఉంటుంది.విలేజ్‌ రెవిన్యూ ఆఫీసర్‌ నుండి, ఆర్‌ఐ ఇంకా ఎంఆర్‌ఓ ఇలా పలువురి వద్దకు ఫైల్‌ వెళ్లాల్సి ఉంటుంది.

ఆ క్రమంలో సర్టిఫికెట్‌ ధరకాస్తు చేసుకున్న వారి చేతి చమురు కూడా వదులుతుంది.అంటే ప్యూన్‌ లకు, ఆర్‌ఐ, వీఆర్‌ఓలకు లంచాలు ఇవ్వాల్సి ఉంటుంది.వంద రెండు వందలే అయినా కూడా ఈ దందా చాలా పెద్దగా సాగుతుందని అందరికి తెల్సిందే.ఇక ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఏపీ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది.

కులం మరియు స్థానికత అనేది ఎప్పుడు మారేది కాదు.అందుకే క్యాస్ట్‌ మరియు లోకల్‌ ఏరియా సర్టిఫికెట్‌ ఒక్కసారి తీసుకుంటే జీవితాంతం పనికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఇక ప్రతి ఏడాది ఇన్‌కమ్‌ మారదు కనుక, ఒకసారి ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌ తీసుకుంటే మూడు సంవత్సరాలు పనికి వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయంతో నిరుద్యోగులు మరియు విద్యార్థులకు చాలా ఊరట అని చెప్పుకోవచ్చు.ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఏపీ ప్రభుత్వంను ఖచ్చితంగా అభినందించాల్సిందే.ఏపీలో మొదలైన ఈ పద్దతిని తెలంగాణలో కూడా అమలు చేయాలి.

తెలంగాణ ప్రభుత్వంకు ఈ విషయం చేరేలా అంతా దీన్ని షేర్‌ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube