వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి సైబర్ మోసాలకు చెక్

వాట్సప్ ( WhatsApp )ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.అందులో భాగంగా కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.

 Good News For Whatsapp Users.. Check Cyber Frauds From Now On , Whatsapp, Whats-TeluguStop.com

ఎప్పుడూ ఏదోక ఫీచర్‌ను కొత్తగా తీసుకొస్తూనే ఉంది.ఇతర మెస్సేజింగ్ యాప్‌ల పోటీని తట్టుకునేందుకు, యూజర్లను మరింతగా పెంచుకుునేందుకు అప్డేట్ ఫీచర్లను వాట్సప్ తీసుకొస్తూనే ఉంది.

ఇప్పటికే అనేక ఫీచర్లను వాట్సప్ కొత్తగా తీసుకురాగా.తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Telugu Cyber, Security, Safety, Whatsapp-Latest News - Telugu

ఇటీవల సైబర్ నేరాలు బాగా ఎక్కువయ్యాయి.నిర్లక్షరాస్యులే కాదు.బాగా చదువుకున్నవారు కూడా సైబర్ మోసాలకు గురవుతున్నారు.అమాయకులనే టార్గెట్ గా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.ఏవోక మాయమాటలు చెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు.డబ్బులు దోచుకున్న తర్వాత జాడ లేకుండా పోతున్నారు.

పార్ట్‌టైమ్ ఉద్యోగమంటూ, వర్క్ ఫ్రమ్ హోం జాబ్ అంటూ వలలో వేసుకుంటున్నారు.అలాగే పెట్టుబడి పెడితే అధికంగా డబ్బులు వస్తాయంటూ మోసగిస్తున్నారు.

Telugu Cyber, Security, Safety, Whatsapp-Latest News - Telugu

ఇలాంటి మోసాలకు చెక్ పెట్టి యూజర్లను రక్షించేందుకు వాట్సప్ నడుం బిగించింది.అందులో భాగంగా వాట్సప్ గ్లోబల్ సెక్యూరిటీ సెంటర్‌( Global Security Centre )ను తాజాగా ప్రారంభించింది.ఈ సెక్యూరిటీ సెంటర్ ద్వారా యూజర్లను సైబర్ నేరాల నుంచి కాపాడనుంది.ఈ సెక్యూరిటీ సెంబర్ 11 భాషల్లో సేవలు అందిస్తోంది.తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ, గుజరాతీ లాంటి భాషల్లో యూజర్లను అప్రమత్తం చేస్తోంది.సైబర్ నేరాల ( Cyber ​​crime )నుంచి ఎలా బయటపడాలనే అంశంతో పాటు సెక్యూరిటీ మెజర్స్, హిడెన్ ట్రిక్‌లు, సెఫ్టీ మెజర్స్‌ను యూజర్లకు తెలియచేస్తుంది.

టూ స్టెప్ వెరిఫికేషన్, స్పామ్ కాల్స్‌ను గుర్తించడం, సేఫ్టీ టూల్స్ ఎలా ఉపయోగించాలనే అంశాలను తెలపనుంది.ఆన్‌లైన్‌లో నకిలీ వాట్సప్ వెర్షన్లు చాలా అందుబాటులో ఉన్నాయి.

కానీ ఓరిజినల్ వాట్సప్ వాడేవారికి మాత్రమే ఈ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.దీంతో ఓరిజినల్ వెర్షన్ వాడాలని వాట్సప్ సూచించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube