రైల్వే ప్రయాణికులకు శుభవార్త : వెయిటింగ్‌ లిస్ట్‌తో ప్రయాణించే వారు, ఇకపై జర్నీ టైంలో దీని సాయంతో సీటు పొందొచ్చు

రైల్వే ప్రయాణం ఎంత సుఖంగా ఉంటుందో రిజర్వేషన్‌ దొరకకుంటే అంత దీనంగా ఉంటుంది.ఎంత డబ్బులు ఇచ్చినా కూడా టీటీ కొన్ని సార్లు సీటు అరేంజ్‌ చేయలేడు.

 Good News For Waiting List Passengers Can Use This List For Seat-TeluguStop.com

దాంతో జనరల్‌లో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది.లాంగ్‌ జర్నీలు జనరల్‌ బోగీల్లో వెళ్తే నరకానికి వెళ్లి వచ్చినట్లే అంటారు.

ముఖ్యంగా కొన్ని రద్దీ రైళ్లల్లో జనరల్‌ బోగీల్లో ప్రయాణించే కంటే నడిచి వెళ్లడం ఉత్తమం అనే అభిప్రాయంను కలిగి ఉంటారు.కాస్త ఖర్చు ఎక్కువ అయినా పర్వాలేదు రిజర్వేషన్‌ చేసుకుందాం అనుకుంటే ఏ రైలు చూసినా కూడా వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంటుంది.

వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న వారు చివరి నిమిషం వరకు సీటు దొరకుతుందేమో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తారు.తీరా రైలు వచ్చాక సీటు లేక ఇబ్బందులు పడుతూ జర్నీ చేస్తూ ఉంటారు.ట్రైన్‌లో ఎక్కడో ఒకచోట సీట్లు, బెర్త్‌లు ఖాళీ ఉంటాయి.వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న వారు ఆ బెర్త్‌ను ఉపయోగించుకోవచ్చు.వెయిటింగ్‌ లిస్ట్‌ వారికి ఆ బెర్త్‌లను టీసీలు ఇవ్వాలి.కాని డబ్బుల కోసం ఆ బెర్త్‌లను జనరల్‌ టికెట్‌ కొనుగోలు చేసిన వారికి ఇస్తూ ఉంటారు.

కాని ఇకపై అలా జరగదు.అంతా ఆన్‌లైన్‌ అవుతున్న కారణంగా ఖాలీలను ప్రయాణికుడు తెలుసుకుని టీసీని అడిగే అవకాశం ఉంది.

అలా ఖాళీ ఉన్న బెర్త్‌లను తీసుకునే అవకాశం ఉంది.

ఇండియన్‌ రైల్వే ఈ కొత్త పద్దతిని తీసుకు వచ్చింది.గతంలో రైలు బోగీల్లో టీసీ చెప్పిన ఖాళీల్లో మాత్రమే ప్రయాణికులు కూర్చోవాలి.ఆయనకు మాత్రమే క్యాన్సల్‌ టికెట్ల గురించి తెలుస్తుంది.

కాని కొత్తగా వచ్చిన హెచ్‌హెచ్‌టీ వ్యవస్థ కారణంగా రైలు ప్రయాణం మొదలైన తర్వాత ఎప్పుడెప్పుడు ఎక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయో ఆ వ్యవస్థ ద్వారా తెలుసుకోవచ్చు.దాన్ని త్వరలోనే మొబైల్‌ యాప్‌ రూపంలో తీసుకు రాబోతున్నారు.

ప్రస్తుతానికి సికింద్రాబాద్‌ నుండి వెళ్లే ఏడు రైళ్లలో ఈ వ్యవస్థ పని చేస్తుంది.రాబోయే రెండు సంవత్సరాల్లో ఇండియన్‌ రైల్వే పూర్తి స్థాయిలో హెచ్‌హెచ్‌టీ వ్యవస్థను వినియోగించనున్నట్లుగా రైల్వే ఉన్నతాధికారి అమిత్‌ పరదాన్‌ పేర్కొన్నారు.

వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నా కూడా సీటు దొరికే ఛాన్స్‌ ఉందనే భరోసాతో ఇకపై ట్రైన్‌ జర్నీ చేసేయొచ్చు.ఈ ఉపయోగదాయకమైన విషయాన్ని మీ స్నేహితులతో కూడా షేర్‌ చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube