టీఆర్ఎస్ శ్రేణులకు అదిరిపోయే గుడ్ న్యూస్... ఇక రచ్చ రచ్చే..

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పార్టీ వర్గాల నుంచి ఒక గుడ్ న్యూస్ అందుతోంది.ఈ న్యూస్ విన్న టీఆర్ఎస్ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

 Good News For Trs Leaders With Nominated Posts Details, Trs, Nominated Posts, Tr-TeluguStop.com

అంతలా వారిని ఆనందానికి గురి చేస్తోన్న వార్త ఏమిటంటే… పార్టీ శ్రేణులకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు అధిష్టానం కసరత్తులు ప్రారంభించిదని తెలుస్తోంది.త్వరలోనే పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగనుందని తెలుస్తోంది.

ఈ నామినేటెడ్ పదవుల కోసం పార్టీలోని సీనియర్ నేతలు ఎప్పటి నుంచో కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.వారి నిరీక్షణ త్వరలోనే ముగియనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం సంక్రాంతి పండుగ పూట పీడ రోజులు ఉంటాయని టీఆర్ఎస్ అధినాయకత్వం యోచిస్తోందట.కాబట్టే త్వరలోనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసిన టీఆర్ఎస్ నాయకత్వం వివిధ కార్పోరేషన్ల, చైర్మన్స్, సభ్యుల పదవులను కూడా భర్తీ చేయాలని చూస్తోందట.ఇలా కార్పోరేషన్ల చైర్మన్ల పదవులు భర్తీ అంటే పార్టీలో ఎటువంటి పదవులు లేకుండా ఉన్న సీనియర్లకు తప్పకుండా అవకాశం వస్తుందని ఆశగా ఉంటారు.

వీరి సమయం ఎలా ఉందో మరి కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ జాబితాను విడుదల చేసిన తర్వాత తెలిసే అవకాశం ఉంది.

ఈ విషయమే కాక మరో విషయం కూడా పార్టీలోని పలువురు నేతలను టెంప్ట్ చేస్తోందట.అదే ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు వేర్వేరు కమిషన్లను వేయాలని ప్రభుత్వం చూస్తోందట.ఇలా వేర్వేరు కమిషన్లు అంటే ఎక్కువ మంది కి అవకాశం వచ్చే అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు.

మరి ఏమవుతుందో త్వరలో తెలియనుంది.టీఆర్ఎస్ నాయకుల ఆశలు నెరవేరుతాయా లేక వారు మరింత కాలం పాటు వేచి చూడాలా? అనేది తేలాలంటే మాత్రం మనం మరికొన్ని రోజుల పాటు వెయిట్ చేయక తప్పదు.

Good News For Trs Leaders With Nominated Posts Details, Trs, Nominated Posts, Trs Leaders, Nominated Posts, Kcr, Ktr, Corporations, Ts Politics, Chairmans, Trs Party Leaders - Telugu Chairmans, Trs, Ts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube