అమెరికా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్...US ఎంబసీ కీలక ప్రకటన...!!!

అగ్ర రాజ్యంలో కరోనా మహమ్మారి వరుస వేరియంట్స్ తో విరుచుకుపడిన తరువాత అమెరికా తమ దేశంలోకి విదేశీయుల ఎంట్రీ బ్యాన్ చేసింది.అమెరికా నుంచీ ఇతర దేశాలకు వెళ్ళే వారు కానీ లేదంటే ఇతర దేశాలలో ఉన్న వారు అమెరికా వెళ్లాలనుకునే వారు ఇలా ఎవరైనా సరే కొన్ని నెలల పాటు వేచి ఉండాల్సిందేనని తెలిపింది, కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత కొన్ని నిభందనలు విధిస్తూ పరిమితి సంఖ్యలో ప్రత్యేక కేటగిరి కలిగిన వారిని మాత్రమే తమ దేశంలోకి అనుమతిచ్చింది.

 అమెరికా వెళ్లాలనుకునే వారికి-TeluguStop.com

ముఖ్యంగా విద్యార్ధులు, ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే అమెరికాలో ఎంట్రీ అవకాశం కల్పించింది.అయితే కరోనా మొదలైన నాటి నుంచీ టూరిస్ట్ వీసాలను అనుమతించ లేదు దాంతో ఎంతో మంది అమెరికా వెళ్లాలనుకునే వారికి నిరాశే మిగిలింది.

కానీ తాజాగా అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో సంచలన ప్రకటిన చేసింది.

అగ్ర రాజ్యం అమెరికాను చూడాలని, అక్కడి పర్యాటకాన్ని వీక్షించాలని అనుకునే వారికి , లేదా అమెరికాలో ఉన్న తమ కుటుంబ సభ్యులను కలవాలని ఏడాదిగా వేచి చూస్తున్న వారికి అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

గడిచిన కాలంగా నిలిపివేసిన టూరిస్ట్ వీసా అప్పాయింట్మెంట్ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించింది.ఈ మేరకు భారత్ లోని అమెరికన్ ఎంబసీ ఈ ప్రకటిన చేసింది.సెప్టెంబర్ 2022 నుంచీ రొటీన్ ఇన్ పర్సన్ టూరిస్ట్ వీసా అప్పాయింట్మెంట్ లను తిరిగి ప్రారంభిస్తున్నామని, గతంలో ఎవరైతే షెడ్యూల్ చేసిన ప్లేస్ హోల్డర్లు ఉన్నారో వారి అప్పాయింట్మెంట్ లు రద్దు చేయబడ్డాయని తెలిపింది.

Telugu India, Place Holders, Routineperson, Tourist Visa, Embassy India-Telugu N

ప్లేస్ హోల్డర్లు అప్పాయింట్మెంట్ లు ఎవరికైతే రద్దు చేయబడ్డాయో వారు ఇప్పుడు మళ్ళీ సాధారణ అప్పాయింట్మెంట్ లు బుక్ చేసుకోవడానికి సిస్టమ్ లోకి మళ్ళీ లాగిన్ అవ్వవచ్చునని ప్రకటించింది.అమెరికన్ ఎంబసీ తాజాగా చేసిన ఈ ప్రకటనతో భారత్ నుంచీ అమెరికా వెళ్లి తమ వారిని కలుసుకోవాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారిలో సంతోషాన్ని నిపింది.ఈ టూరిస్ట్ వీసాల జారీని భారత్ లోని అన్ని ఎంబసీ లతో పాటు కాన్సులేట్ కార్యాలయాలలో ఉండేలా చర్యలు తీసుకుంది ఎంబసీ

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube