ఆ వాహ‌నాలు వాడే వారికి గుడ్ న్యూస్‌.. ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌

మ‌న దేశంలో రోజురోజుకూ ఎంత‌లా కాలుష్యం పెరుగుతోందో చూస్తూనే ఉన్నాం.రోడ్ల మీద విప‌రీత‌మైన ట్రాఫిక్ పెరుగుతోంది.

 Good News For Those Who Use Those Vehicles . Government Is A Key Proclamation, E-TeluguStop.com

వీట‌న్నింటినీ కంట్రోల్ చేసేందుకు ప్ర‌భుత్వాలు డీజిల్‌, పెట్రోల్ వాహ‌నాల‌కు బ‌దులుగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి.కాలుష్యంతో పాటు చమురు ధరలు కూడా ఓ రేంజ్‌లో పెరిగిపోవ‌డంతో అంతా వీటిమీద ఆస‌క్తి చూపుతున్నారు.

ఇక కంపెనీలు కూడా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి.అయితే ఢిల్లీలో ఏ రేంజ్‌లో కాలుష్యం అవుతుందో మ‌నం చూస్తూనే ఉన్నాం.

ఇక్క‌డ కాలుష్యాన్ని త‌గ్గించేంఉకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్ప‌టికే అనేక ర‌కాల ఆంక్షలను విధించింది.అయినా కూడా పెద్ద‌గా ఫ‌లితం రావ‌ట్లేదు.గ‌తంలో పదేళ్లు దాటిన పెట్రోల్‌, డీజిల్ వాహ‌నాల‌ను రోడ్డు మీదకు రావొద్దంటూ ఆదేశించింది.ఒక‌వేళ వ‌స్తే మాత్రం క‌చ్చితంగా సీజ్ చేస్తామని హెచ్చ‌రించింది.

అయితే ఇప్పుడు ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌న ఈ వాహ‌నాలు ఉన్న వారికి పెద్ద ఊర‌ట నిచ్చింది.ప‌దేండ్లు దాటిన వాహ‌నాల‌ను ఇప్పుడు ఎలక్ట్రికల్ గా మార్చేందుకు కేజ్రీవాల్ ప్ర‌భుత్వం క్లియ‌రెన్స్ ఇచ్చింది.

అంటే డీజిల్‌, పెట్రోల్ ఇంజిన్ల‌ను ఎలక్ట్రిక్ ఇంజిన్ లుగా మార్చుకుని వాడుకోవ‌చ్చ‌న్న‌మాట.

Telugu Delhi, Disel, Electric Engens, Kajgreiwal, Pertrol, Pollutio, Vechilschan

ఇప్ప‌టికే ఢిల్లీ రవాణాశాఖ ఈ మేర‌కు ప‌నులు కూడా మొద‌లు పెట్టేసింది.ప్రదాయ లోకోమోటివ్ ను ఎలక్ట్రిక్ లోకోమోటివ్ తో రీప్లేస్ చేసి వాహ‌నాల‌ను వాడుకునేందుకు రవాణా శాఖ స‌హాయ‌, స‌మ‌కారాలు అందిస్తుంద‌ని ఢిల్లీ రవాణాశాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అయితే ఇలా రిట్రోఫిట్ చేసినటువంటి వెహిక‌ల్స్‌ను పది సంవ‌త్సారాల‌కు మించి వాడొచ్చంటూ స్ప‌ష్టం చేశారు.2024 సంవ‌త్సరం వ‌చ్చే వ‌రకు దాదాపుగా 25 శాతం ఈ వెహిక‌ల్స్ వృద్ధి చెందే విధంగా అన్ని ర‌కాల ఏర్పాట్లు చేస్తామ‌ని కేజ్రీవాల్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.దీంతో ఈ వెహిక‌ల్స్ ఉన్న వారికి ఇది మంచి అవ‌కాశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube