తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!!

2018 వ సంవత్సరం లో ముందస్తు ఎన్నికలకు వెళ్లినా కేసీఆర్ సర్కార్ అప్పట్లో రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇవ్వటం అందరికీ తెలిసిందే.అయితే ఎన్నికల్లో గెలిచి రెండు సంవత్సరాలు అయిన తరుణంలో ఈ ఏడాది ప్రారంభంలో మంత్రి కేటీఆర్ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రెడీ అవుతున్నట్లు ఇటీవల స్పష్టం చేయడం జరిగింది
.

 Good News For The Unemployed In Telangana,kcr,ktr,unemployment Scheme,ts Poltics-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా మరికొద్ది రోజుల్లో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టే తరుణంలో నిరుద్యోగ భృతి కింద రూ.5,000 నుండి 7,000 కోట్ల కేటాయింపునకు కేసీఆర్ ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.దాదాపు రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ కుటుంబ సమగ్ర సర్వే బట్టి చూస్తే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో విద్యార్హత ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలా, లేకపోతే హామీ ఇచ్చిన ప్రకారం 3016/- రూపాయలు ఇస్తే సరిపోతుందా అన్నది తేల్చుకునే స్థితిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఏది ఏమైనా మాత్రం మరి కొద్ది నెలల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు సీఎం కెసిఆర్ నిరుద్యోగ భృతి ఇవ్వటం గ్యారెంటీ అనే టాక్ బలంగా వినబడుతోంది. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube