భాగ్యనగర ప్రజలకి శుభవార్త .. సిటీ దాటేసిన వాయుగుండం !

గత కొన్ని రోజులు వర్షాలు హైదరాబాద్ ను తడిపి ముద్ద చేస్తున్నాయి.ఇక తాజాగా కురుస్తున్న వానల దెబ్బకి హైదరాబాద్ మహానగరం చెరువుని తలపిస్తుంది.

 Hyderabad , Heavy Rain , Telangana, Karnataka, Ghmc,ndrf,air Balloon-TeluguStop.com

ఎక్కడిక్కడ చెరువులు నిండిపోయి , రోడ్లపైకి నీళ్లు వచ్చేస్తున్నాయి.అలాగే పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైయ్యాయి.

భారీ వర్షాలకు ఇప్పటికే నగరంలో 24 మంది మరణించారు.పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

వరదలో చిక్కుకున్న పలువురిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఈ సమయంలో హైదరాబాద్‌ ను వాయుగుండం దాటేసిందంటూ వాతావరణ శాఖ వెల్లడించింది.

దాదాపు 30 ఏళ్ల తరువాత హైదరాబాద్‌ మీదుగా ప్రయాణించిన వాయుగుండం కర్ణాటకకు చేరడంతో మరో పెద్ద గండం తప్పింది.ఇక , వాయుగుండం రాష్ట్రాన్ని దాటడంతో గ్రేటర్‌ లో ఇక భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపారు.

అయితే దీని ప్రభావంతో రాగల మరో నాలుగు రోజులు తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వివరించింది.

మరోవైపు వాయుగుండం ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

మంగళవారం వర్షాలకు హైదరాబాద్‌ నగరం తడిసి ముద్దయింది.భారీ వర్షానికి పోటెత్తిన వరద ఉధృతి ఇంకా తగ్గలేదు.

ఇక బుధవారం రాత్రి నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube