తెలుగు రాష్ట్రాల క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్

క్రికెట్ ప్రేమికులను ఎంతగానో అలరించిన ఐపీఎల్ ముగియక ముందే తెలుగు వారికి బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది.ఐపీఎల్ అందించిన వినోదాన్ని కొనసాగిస్తూ మరో ఆసక్తికర క్రికెట్ లీగ్ నిర్వహణకు పచ్చజెండా ఊపింది.

 Good News For Telugu State Cricket Lovers , Cricket , News , Viral , Good News-TeluguStop.com

తాజా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ట్వంటీ-20 టోర్నమెంట్ నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆమోదం తెలిపింది.విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఏపీఎల్‌ను నిర్వహించాలనే ప్రతిపాదనను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ముందుకు తెచ్చింది.

రెండు వారాల పాటు జరిగే ఈ టోర్నీ జూన్ 22న విశాఖపట్నం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ప్రారంభమవుతుంది.

విశాఖపట్నంలో ఏపీఎల్‌ నిర్వహణకు బీసీసీఐ అధికారికంగా ఆమోదం తెలిపిందని ఏసీఏ కోశాధికారి ఎస్‌ఆర్‌ గోపీనాధ్‌రెడ్డి, ఏసీఏ సీఈవో ఎంవీ శివారెడ్డి మీడియాకు వెల్లడించారు.

ఏపీఎల్ టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు ఏసీఏ ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు చేసింది.ఫ్రాంచైజీల కోసం ఏసీఏ త్వరలో టెండర్లను ఆహ్వానించనుంది.వేలం ద్వారా బిడ్‌లు ఖరారు చేయబడతాయి.అన్ని మ్యాచ్‌లు ప్రముఖ ఓటీటీలలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

ఫ్లడ్ లైట్ల వెలుగులో ప్లేఆఫ్‌లు, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.జట్లు, ఆటగాళ్ల వివరాలు, మ్యాచ్ షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని వారు తెలిపారు.

టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఏసీఏ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.పురుషుల ఏపీఎల్‌ను జూన్ 22 నుండి జూలై 3 వరకు, మహిళల ఏపీఎల్‌ను జూన్ 28 నుండి జూలై 3 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈ మ్యాచ్‌లన్నింటినీ విశాఖపట్నంలోనే నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.ఈ టోర్నమెంట్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులైన తెలుగు క్రికెటర్లు వెలుగులోకి వస్తారని వారు భావిస్తున్నారు.

ఏసీఏ తాజా ప్రకటనతో చాలా మంది క్రికెటర్లలో ఆశలు చిగురిస్తున్నాయి.వీటిలో ప్రతిభ చాటిన వారికి ఖచ్చితంగా ఐపీఎల్‌లో చోటు లభించే అవకాశం ఉంటుంది.

ఐపీఎల్‌లో చోటు దక్కించుకుని, మ్యాచ్ విన్నర్లుగా సత్తా చాటితే వారి క్రికెట్ కెరీర్‌కు ఢోకా ఉండదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube